గుండెపోటుకు కారణం ఇదే.. తాజా అధ్యయనంలో వెల్లడి..   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గుండెపోటుకు కొలెస్ట్రాల్ ప్రధాన కారణమని ఇప్పటివరకు భావించినా, తాజా అధ్యయనాలు అందుకు కారణం వేరే ఉందని చెబుతున్నాయి. చక్కెర అధికంగా తీసుకోవడమే గుండె సంబంధిత సమస్యలకు మూలకారణమని పలు అధ్యయనాలు తేల్చాయి. అధిక చక్కెర వినియోగం గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

పరిశోధనల ప్రకారం.. అధిక చక్కెర రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది, ఇది రక్తనాళాల్లో అడ్డంకులను సృష్టించి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఆరోగ్యంగా ఉండడానికి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ముఖ్యమే, కానీ చక్కెర తీసుకునే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్వీట్లు, సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉండే చక్కెరను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. పోషకాహారం, వ్యాయామం, చక్కెర తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా చాలా వరకూ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.