సమోసాలు, జిలేబీలపై హెచ్చరిక పుకార్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

షేర్ చేయండి:
సమోసాలు, జిలేబీలపై హెచ్చరిక పుకార్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

సాక్షి లైఫ్ : సమోసాలు, జిలేబీలపై హెచ్చరిక వాదనను అబద్ధమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిన్న నూనె,చక్కెర బోర్డులను ఏర్పాటు చేయమని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. సమోసాలు, జిలేబీ, లడ్డు వంటి ఆహార పదార్థాల గురించి హెచ్చరికలను ప్రదర్శించాలని మంత్రిత్వ శాఖ విక్రేతలను ఆదేశించిందనే వార్తను తప్పుదారి పట్టించే నిరాధారమైన వార్తగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

 

ఇది కూడా చదవండి..విటమిన్ బి12 లోపం : విటమిన్ బి12 సమృద్ధిగా ఉండే శాఖాహార ఆహారాలు..

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి సమోసాలు, కచోరీలు, పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, పకోరాలు, వడ పావ్, శీతల పానీయాలు, చాక్లెట్ పేస్ట్రీలు, గులాబ్ జామున్ వంటి ఆహార పదార్థాలలో చక్కెర, నూనె మొత్తాన్ని ప్రస్తావిస్తూ 'నూనె,చక్కెర బోర్డులను' ప్రదర్శించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వయంప్రతిపత్తి సంస్థలను కోరినట్లు నిన్న వార్త వచ్చింది. 

మంత్రిత్వ శాఖ క్లారిటీ.. 

వివిధ ఆహార పదార్థాలలో కొవ్వు, అదనపు చక్కెర గురించి ఆరోగ్య సందేశాలపై తన సలహా విక్రేతలు తమ ఉత్పత్తులపై హెచ్చరికలను ప్రదర్శించమని ఆదేశించడం లేదని, దేశంలోని ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ సంస్కృతిని లక్ష్యంగా చేసుకోలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  స్పష్టం చేసింది.

 ఆహార ఉత్పత్తులలో కొవ్వు, అదనపు చక్కెర గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక ఆచరణాత్మక సూచన అని మంత్రిత్వ శాఖ ఓప్రకటనలో తెలిపింది. ఏదైనా నిర్దిష్ట ఆహార ఉత్పత్తి గురించి కాదు.

పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఎంపికలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రోత్సహించడం,శారీరక శ్రమను పెంచమని ప్రజలను ప్రోత్సహించడం వంటి ఇతర సందేశాలను కూడా సలహాలో ప్రస్తావించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.  

 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.