ప్రపంచంలోనే మొట్టమొదటి కిడ్నీ ఆకారపు ఆసుపత్రి..

సాక్షి లైఫ్ : ప్రపంచంలోనే మొట్టమొదటి కిడ్నీ ఆకారంలో ఉన్న కిడ్నీ ఆసుపత్రితోపాటు పరిశోధన కేంద్రాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఎయిమ్స్ తర్వాత గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి కిడ్నీ ఆకారంలో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. బిటి సవానీ కిడ్నీ ఆసుపత్రికి ప్రభుత్వం భూమి కేటాయించింది. అదనపు భూమి కోసం ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ ఆసుపత్రి నిర్మాణం తర్వాత రాజ్‌కోర్ట్‌లో పెద్ద మెడికల్ హబ్ ను నిరించనున్నారు.

AIIMS తర్వాత రాజ్‌కోట్‌లో కిడ్నీ ఆకారంలో ఆసుపత్రిని నిర్మించనున్నారు.. 

సౌరాష్ట్ర కిడ్నీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 

ఆసుపత్రికి అవసరమైన స్థలాన్ని గుజరాత్ ప్రభుత్వం కేటాయించింది.

కొత్త కిడ్నీ ఆసుపత్రిలో ఆధునిక చికిత్సతో పాటు పరిశోధన పనులు కూడా జరగనున్నాయి.

గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రధాన నగరమైన రాజ్‌కోట్‌లో ఈ ప్రత్యేకమైన ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ ఆసుపత్రి భవనం డిజైన్ కిడ్నీ ఆకారంలో ఉంటుంది. రాజ్‌కోట్‌లో మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయబోతున్న తరుణంలో రాజ్‌కోట్‌లోని ఈ ప్రత్యేకమైన కిడ్నీ ఆసుపత్రి ప్రకటన వచ్చింది. గుజరాత్‌లోని మొదటి ఎయిమ్స్ కూడా దాదాపు రాజ్‌కోట్‌లో నిర్మించారు. 

పరిశోధనలు.. 

ప్రపంచంలోనే మొట్టమొదటి కిడ్నీ ఆకారంలో ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ ఆసుపత్రిలో పరిశోధన కేంద్రం కూడా ఉంటుంది. ఇందులో దేశ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థి వైద్యులు పరిశోధనలు చేయగలరు. ఈ ఆసుపత్రి పేరు బిటి సవానీ కిడ్నీ హాస్పిటల్. ఈ ఆసుపత్రిని నిర్మించడం వెనక ప్రధాన లక్ష్యం ఆధునిక కిడ్నీ చికిత్స అందించడం. స్మార్ట్ సిటీ కింద, అహ్మదాబాద్, ఢిల్లీ , విదేశాలకు చెందిన ఆర్కిటెక్ట్‌లు కిడ్నీ ఆకారంలో జంట టవర్లను నిర్మిస్తారు.

21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 

గుజరాత్‌లోని సౌరాష్ట్ర , కచ్ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల చికిత్సలో 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సవానీ కిడ్నీ హాస్పిటల్ ఈ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించుకుంది. 1998 సంవత్సరంలో, సౌరాష్ట్ర ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల దుస్థితిని దృష్టిలో ఉంచుకుని, డాక్టర్ ప్రదీప్‌భాయ్ కాన్సాగ్రా, దేవ్‌జీభాయ్ పటేల్, జయంతిభాయ్ ఫల్దు, రమేష్‌భాయ్ పటేల్ సౌరాష్ట్ర కిడ్నీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రాజ్‌కోట్ పేరుతో ఒక ట్రస్ట్‌ను స్థాపించారు. దీని తరువాత, రాజ్‌కోట్‌లో బిటి సవానీ కిడ్నీ ఆసుపత్రిని నిర్మించారు.

 కొత్త ఆసుపత్రి నిర్మాణంతో కిడ్నీ చికిత్స కోసం దూర ప్రాంతాల నుంచి ప్రజలు రాజ్‌కోట్‌కు రావచ్చు. రాజ్‌కోట్‌లో ప్రత్యేకమైన కిడ్నీ ఆసుపత్రి నిర్మాణం రాజ్‌కోట్‌లో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలను అందిస్తుంది.  2015 సంవత్సరంలో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (IKDRC) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రారంభించారు.

ఇది కూడా చదవండి.. ఆరోగ్య చిట్కాలు: మండే ఎండల్లో వేడిని నివారించడానికి ఇలా చేయండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kidney-shaped-hospital
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com