కఫాల్ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?  

సాక్షి లైఫ్: భారత ప్రధాన మంత్రి మోదీ కఫాల్ ఫ్రూట్ ను రుచి చూసి ఫిదా అయ్యారు. ఇటీవల్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నరేంద్ర మోదీకి  కఫాల్ పండ్లు పంపగా వాటిని టేస్ట్ చేసిన ప్రధానమంత్రి కృతఙ్ఞతలు తెలిపారు. సాక్షాత్తు పీఎం మోదీనే ఫిదా అయిన ఈ పండు తినడంవల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం..కఫాల్ వృక్షశాస్త్ర నామం మెరికా ఎస్కులాటా. ఇది మధ్య హిమాలయ ప్రాంతాలలో కనిపించే చెట్టు. ఎండాకాలంలో కఫాల్ ఫ్రూట్ మూడు నెలల పాటు లభిస్తుంది. దీని చెట్లు చల్లని వాతావరణంలో ఉంటాయి. ఈ పండ్లు గుత్తులుగా గుత్తులుగా కాస్తాయి.

ఇది కూడా చదవండి.. ఇండియన్ టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్.. ఏది బెస్ట్..?  

సమ్మర్ సీజన్ లో.. 

పర్వత పండ్లలో రారాజుగా భావిస్తారు ఈ కఫాల్ ఫ్రూట్ ని. పులుపు, తీపి రుచులతో కలగలసి ఉంటుంది. ప్రారంభ దశలో ఈ పండు రంగు ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఏప్రిల్ చివరిలో పండు పండినప్పుడు, దీని రంగు ఎర్రగా ఉంటుంది. ఉత్తరాఖండ్ తోపాటు హిమాలయపర్వత ప్రాంతాల్లో ఎక్కువగా పాండే ఈ పండు. కేవలం సమ్మర్ సీజన్ లోనే లభిస్తుంది. పర్యాటకులు ఇక్కడ ఆహ్లాదకరమైన పర్వత గాలి, కఫాల్‌ జ్యూస్ ను ఆస్వాదిస్తూ ఉంటారు. కఫాల్ కిలో ధర రూ.400 వరకు ఉంటుంది.  

 
కఫాల్ ఫ్రూట్ చెట్టు 1300 మీ నుంచి 2100 మీ (4000 అడుగుల నుంచి 6000 అడుగులు) వరకు ఎత్తులో ఉన్న ప్రాంతాలలో పెరుగుతుంది. కఫాల్ పండు తినడం ద్వారా అనేక ఆరోగ్యకరమైనప్రయోజనాలు పొందవచ్చు. కఫాల్ గురించి పర్వత జానపద పాటలు కూడా ఉన్నాయి. ప్రఖ్యాత థియేటర్ ఆర్టిస్ట్ మోహన్ ఉప్రేటి బెడు పాకో బార్ మాసా, నరేన్ కఫాల్ పాకో చేట్ మేరీ చైలా వంటి సంగీతాన్ని సమకూర్చారు. 

కఫాల్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

-ఈ అడవి పండులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
-జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, సి విటమిన్ వంటివి కఫాల్ ఫ్రూట్ లో ఉన్నాయి. 
-కఫాల్ పండు జ్యుసిగా కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా  ఉంటుంది. 

-ఈ పండు తినడం వల్ల అనేక రకాల పొట్ట రుగ్మతలు నయమవుతాయి.

-మానసిక వ్యాధులతోపాటు అనేక రకాల వ్యాధులకు కఫాల్ ఉపయోగపడుతుంది.

- జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు. 

-కఫాల్ చెట్టు బెరడు కూడా అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఇవి  ఆస్తమా, డయేరియా, జ్వరం, టైఫాయిడ్, విరేచనాలు,ఊపిరితిత్తుల వ్యాధుల నిర్మూలనకు చాలా ఉపయోగపడుతాయి.

ఇది కూడా చదవండి.. రాత్రిపూట నిల్వ ఉంచిన నీరు తాగడం సురక్షితం కాదా..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : healthy-foods myrica-esculenta kafal-plant kafal-fruit pm-narendra-modi himalayan-region uttarakhand chief-minister pushkar-singh-dhami

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com