ICMR Shocking Report : ఐసీఎంఆర్ సంచలన నివేదిక : ఐవీఎఫ్‌తో అప్పుల్లో 90శాతం మంది భారతీయ కుటుంబాలు.. 

సాక్షి లైఫ్ : సంతానం లేక ఐవీఎఫ్‌ (In-Vitro Fertilisation) చికిత్స తీసుకుంటున్న భారతీయ కుటుంబాలపై ఆర్థిక భారం, సామాజిక అంశాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సంచలన నివేదికను విడుదల చేసింది. దేశంలో సుమారు 2.8 కోట్ల జంటలు సంతాన సమస్యలతో బాధపడుతుండగా, ఐవీఎఫ్ చికిత్స తీసుకునే వారిలో దాదాపు 90 శాతం మంది ముఖ్యంగా పది మందిలో తొమ్మిది మంది అప్పుల పాలవుతున్నారని ఈ నివేదిక హెచ్చరించింది. ఈ చికిత్సను 'ఆయుష్మాన్ భారత్' పరిధిలోకి తీసుకురావాలని ICMR-NIRRCH నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

 

ఆర్థిక భారంతో..  

 సంతానలేమి చికిత్సల్లో అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఐవీఎఫ్. అయితే, దీని ఖర్చు అధికంగా ఉండటం వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఇది అందుబాటులో ఉండటం లేదు. ప్రధానంగా ప్రైవేట్ రూ. 2.3 లక్షలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ. 1.1 లక్షలు సగటు ఖర్చు, కాగా ఒక ఐవీఎఫ్ చికిత్సకు ఆరోగ్య వ్యవస్థ ఖర్చు (Health System Cost)రూ. 81,332 సిఫార్సు చేసిన రీయింబర్స్‌మెంట్ రేటు. ఇంటి వార్షిక ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువ ఖర్చును "దారుణమైన  వైద్య ఖర్చు"గా పరిగణిస్తారు. ఐవీఎఫ్‌ చేయించుకున్న వారిలో దాదాపు 89 శాతం మంది ఈ పరిధిలోకి వస్తున్నారు.

సమస్య ఎవరిలో ఎక్కువ..? 

46 శాతం మహిళల్లోని లోపాల వల్ల, 20 శాతం పురుషుల్లోని లోపాల వల్ల సంతానలేమి సమస్యలు సంభవిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. మహిళల్లో సంతానలేమికి ప్రధాన కారణాల్లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఒకటిగా ఉంది. 

ఐసీఎంఆర్ ముఖ్య సిఫార్సులు ఏమిటి..? 

ఐవీఎఫ్ చికిత్సను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి, పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఐసీఎంఆర్ కీలక సిఫార్సులను చేసింది. 

ఆయుష్మాన్ భారత్‌లో చేర్చాలి.. 

ఐవీఎఫ్ చికిత్సను కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య పథకమైన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) పరిధిలోకి తీసుకురావాలి. ఒక్కో ఐవీఎఫ్ సైకిల్‌కు రూ. 81,332 చొప్పున ప్యాకేజీ రేటును నిర్ణయించి, PMJAY కింద రీయింబర్స్ చేయాలని సూచించింది.

OPD ఖర్చుల కవరేజ్.. 

 ఐవీఎఫ్‌తో సహా సంతానలేమి చికిత్సల్లో ఎక్కువ ఖర్చు "ఔట్-పేషెంట్ విభాగం (OPD)"లోనే జరుగుతోంది. ప్రస్తుతం PM-JAYలో OPD సేవలు కవర్ కావడం లేదు. ఈ ఖర్చులను కూడా రీయింబర్స్ చేయాలని కోరింది. సంతానలేమి అనేది కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా, దీనిని జాతీయ ప్రజా ఆరోగ్య ఎజెండాలో ముఖ్యమైన అంశంగా చేర్చాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. 

నియంత్రణ కీలకం.. 

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) చట్టం, 2021ని తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా దేశంలోని ఐవీఎఫ్ క్లినిక్‌లు, బ్యాంకుల కార్యకలాపాలను నియంత్రించడం, రోగుల భద్రత, హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐసీఎంఆర్ నివేదిక ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది. సంతానలేమి చికిత్సల నియంత్రణ, భద్రత, అందుబాటుపై ఐసీఎంఆర్ నివేదిక చేసిన సిఫార్సులపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలా స్పందిస్తుందో, ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

 

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : icmr-research infertility-problems india infertility icmr indians indian-mothers indian-healthcare ivf-risks infertility-in-modern-couples icmr-report ivf-debt-india ivf-treatment-cost ivf-expenses-india fertility-treatment-debt icmr-fertility-study
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com