Malaria strikes again: మలేరియా కేసుల సంఖ్య, మరణాల పెరుగుదలపై డబ్ల్యూ హెచ్ ఓ హెచ్చరిక..!

సాక్షి లైఫ్ : దశాబ్దాలుగా మలేరియా (Malaria)పై పోరాటంలో సాధించిన పురోగతి మందగించింది. తిరిగి ఈ ప్రాణాంతక వ్యాధి పంజా విసురుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్రంగా హెచ్చరించింది. తాజాగా విడుదల చేసిన 'ప్రపంచ మలేరియా నివేదిక 2025' ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసులు, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

 నివేదికలోకీలక అంశాలు..  

2024లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 28.2 కోట్ల మంది మలేరియా బారిన పడినట్లు అంచనా. 2024లో మలేరియా కారణంగా సుమారు 6,10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. నమోదైన కేసుల్లో 94 శాతం, మరణాలలో 95 శాతం ఆఫ్రికా ప్రాంతంలోనే సంభవించాయి. మరణించిన వారిలో ఐదేళ్ల లోపు చిన్నారులే అత్యధికంగా ఉన్నారు.

  పెరుగుదలకు ప్రధాన కారణాలు ఏమిటి..? 

మలేరియా నియంత్రణ చర్యలు బలహీనపడటానికి, కేసులు పెరగడానికి WHO అనేక కారణాలను వెల్లడించింది. మలేరియా చికిత్సలో ప్రధానంగా ఉపయోగించే మందులకు ఆర్టెమిసినిన్ ఆధారిత చికిత్సలు, మలేరియా పరాన్నజీవి నిరోధకతను పెంచుకోవడమే అతిపెద్ద ముప్పుగా నిలిచింది.

మలేరియా నియంత్రణ కార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయిలో, ప్రభుత్వాల నుంచి నిధులు ఆశించినంతగా అందకపోవడం. ఉష్ణోగ్రతలు, వర్షపాతం మారడం వల్ల దోమలు వృద్ధి చెందే వాతావరణం మారి, వ్యాప్తి విస్తరిస్తోంది. దోమ తెరలు, స్ప్రేలలో వాడే క్రిమిసంహారక మందులకు దోమలు నిరోధకతను పెంచుకోవడం.

 

 భారతదేశంలో పరిస్థితి..? 


ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతంలో నమోదైన కేసుల్లో 73.3 శాతం భారతదేశంలోనే ఉన్నాయి. అయితే, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారతదేశం 2017 - 2023 మధ్య మలేరియా కేసులు, మరణాలలో గణనీయమైన తగ్గుదలను నమోదు చేస్తూ అద్భుతమైన పురోగతి సాధించింది.

 నివారణే ప్రధానం..  

కొత్తగా అందుబాటులోకి వచ్చిన మలేరియా టీకాలు (Malaria Vaccines), కొత్త రకం దోమతెరలు (Dual-ingredient Bed Nets) వంటి కొత్త పద్ధతుల ద్వారా 2024లోనే సుమారు 17 కోట్ల కేసులు, 10 లక్షల మరణాలు నివారించినట్లు నివేదిక పేర్కొంది. ప్రజలు తప్పనిసరిగా దోమతెరలు వాడటం, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, మలేరియా లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం చేయాలి.

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : who who-report who-report-2024 world-health-organization world-health-organization-statistics malaria mosquitoes symptoms-of-malaria-fever how-to-get-rid-of-mosquitoes do-male-mosquitoes-bite-humans how-mosquitoes-bite female-mosquitoes
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com