Diabetes: డయాబెటిస్ కొత్త ముప్పు: మూత్రాన్ని నియంత్రించలేకపోవడం వెనుక అసలు రహస్యం ఇదే..!

సాక్షి లైఫ్ : మధుమేహంతో బాధపడుతున్న వారిలో తరచుగా కనిపించే సమస్యల్లో యూరినరీ ఇంకంటినెన్స్ అంటే..? మూత్రాన్ని నియంత్రించ లేకపోవడం ఒకటి. అయితే, ఈ సమస్యకు మూలకారణాన్ని గుర్తించడానికి వైద్య నిపుణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సమస్యకు సంబంధించిన ముఖ్య బయోమార్కర్‌ను కనుగొనే ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ప్రస్తుతం ఉన్న పరిశోధనల ప్రకారం, మధుమేహం అదుపులో లేకపోవడం వల్ల శరీరంలో పెరిగే గ్లూకోజ్ స్థాయిలే ప్రధాన కారణం. మూత్రాశయం (బ్లాడర్)నరాలపై ప్రభావం చూపుతాయి.

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

 

  ప్రధానంగా కనిపించే సమస్యలు..  

నరాల బలహీనత (neuropathy).. 

 మధుమేహం కారణంగా మూత్రాశయానికి సంబంధించిన నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల మూత్రాశయం నిండినతర్వాత ఆయా సంకేతాలు మెదడుకు సరిగ్గా చేరవు. దీంతో మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం లేదా అప్రయత్నంగా మూత్రం లీక్ అవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఊబకాయం (Obesity)..

అధిక బరువు ఉన్నవారిలో, ముఖ్యంగా మహిళల్లో, పొత్తికడుపుపై ఒత్తిడి పెరిగి 'స్ట్రెస్ ఇంకంటినెన్స్' దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మూత్రం లీక్ అవడం వంటి సమస్య ఎక్కువ అవుతుంది.

యూరిన్ ఇన్ఫెక్షన్లు (Urinary tract infections)..  

రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తాయి. ఇవి కూడా మూత్ర నియంత్రణపై ప్రభావం చూపుతాయి. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను తప్పనిసరిగా అదుపులో ఉంచుకోవాలి. HbA1c పరీక్ష ద్వారా దీర్ఘకాలిక చక్కెర నియంత్రణను తెలుసుకోవడం చాలా ముఖ్యం. యూరినరీ ఇంకంటినెన్స్ లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా యూరాలజిస్ట్ లేదా నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించాలి. సరైన చికిత్స, జీవనశైలి మార్పులు , ఫిజియోథెరపీ ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diabetes urination diabetes-risk diabetes-patients how-to-beat-diabetes what-is-diabetes preventing-pre-diabetes reversing-prediabetes urine-test
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com