Ebola Outbreak in Congo : కాంగోలో ఎబోలా విజృభణ : 220 దాటిన అనుమానాస్పద మరణాలు.. రంగంలోకి డబ్ల్యూహెచ్‌ఓ.. 

షేర్ చేయండి:
Ebola Outbreak in Congo : కాంగోలో ఎబోలా విజృభణ : 220 దాటిన అనుమానాస్పద మరణాలు.. రంగంలోకి డబ్ల్యూహెచ్‌ఓ.. 

సాక్షి లైఫ్ : ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో అరుదైన 'బుండిబుగ్యో' ఎబోలా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుత వ్యాప్తి కారణంగా దేశంలో ఇప్పటివరకు దాదాపు 220 మంది అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ గుర్తింపులో జరిగిన ఆలస్యం వల్ల వ్యాధి నియంత్రణ చర్యలు సవాలుగా మారాయని, ప్రస్తుతం తాము వైరస్‌ను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

వేగంగా పెరుగుతున్న కేసులు..

కాంగో వ్యాప్తంగా ఇప్పటివరకు 101 ధృవీకరించిన కేసులతో కలిపి మొత్తం 900కు పైగా అనుమానాస్పద ఎబోలా కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కాంగో సరిహద్దు దేశమైన ఉగాండాలోనూ కొత్తగా రెండు ఎబోలా కేసులు వెలుగుచూడటంతో అక్కడ మొత్తం బాధితుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ నేపథ్యంలో సరిహద్దు దేశాలన్నీ తక్షణమే అప్రమత్తమై నిఘా చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. పరిస్థితిని సమీక్షించేందుకు స్వయంగా కాంగోలో పర్యటించనున్నట్లు టెడ్రోస్ వెల్లడించారు.

పారిపోతున్న రోగులు..

ఒకవైపు వైరస్ భయపెడుతుంటే, మరోవైపు కాంగోలోని తీవ్ర అభద్రతా భావం, అంతర్గత ఘర్షణలు పరిస్థితిని మరింత జటిలంగా మారుస్తున్నాయి. ఈశాన్య ప్రాంతమైన ఇతూరిలో వైద్య కేంద్రాలపై దుండగులు దాడులకు తెగబడుతున్నారు. గత వారాంతంలో ఒకే ఆసుపత్రిపై రెండుసార్లు దాడులు జరగడంతో, చికిత్స పొందుతున్న రెండు డజన్లకు పైగా రోగులు ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయారు.

కనీస వైద్య సదుపాయాలు లేక అల్లాడుతున్న సరిహద్దు ప్రాంతాల్లో ఇటువంటి దాడులు వైద్యులకు పెద్ద శాపంగా మారాయి. గతంలో (2018-2020) తూర్పు కాంగోలో జరిగిన ఇలాంటి హింసాత్మక దాడుల్లో దాదాపు 25 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు.

లక్షణాలు లేని 'బుండిబుగ్యో' స్ట్రెయిన్.. 

ప్రస్తుతం కాంగోను వణికిస్తున్నది అరుదైన 'బుండిబుగ్యో' ఎబోలా రకం. దీనికి మార్కెట్లో ఇప్పటివరకు ఎటువంటి అధీకృత వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం ఆందోళనను రెట్టింపు చేస్తోంది. బాధితుల శారీరక ద్రవాలను రక్తం, లాలాజలం వంటివి. నేరుగా తాకడం ద్వారా ఈ ప్రాణాంతక వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఇది సోకిన వారిలో అంతర్గత, బాహ్య రక్తస్రావంతో పాటు అవయవాలు వైఫల్యం చెంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు కాంగోలోని సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా బృందాలను భారీగా రంగంలోకి దించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.