Ebola Outbreak : కాంగోను హడలెత్తిస్తున్న ఎబోలా మహమ్మారి.. 131 మంది మృతి..

షేర్ చేయండి:
Ebola Outbreak : కాంగోను హడలెత్తిస్తున్న ఎబోలా మహమ్మారి.. 131 మంది మృతి..

సాక్షి లైఫ్ : ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లో ఎబోలా వైరస్ మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. ఈ ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి చెందుతున్న వేగం, తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దఫా ఎబోలా విస్తరణ తీవ్ర రూపం దాల్చవచ్చని, దీర్ఘకాలం పాటు ఈ ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తీవ్ర అంటువ్యాధి అయిన ఈ 'హెమరేజిక్ ఫీవర్' విజృంభణ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ సంక్షోభంపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరి

 

మరణాల సంఖ్య 131కి చేరిక.. 

కాంగో ఆరోగ్య శాఖ మంత్రి శామ్యూల్ రోజర్ కాంబా వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి దేశంలో సుమారు 513 అనుమానిత కేసులు నమోదు కాగా, వారిలో 131 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ప్రస్తుతం బాధితులు ఎక్కువగా రవాణా సౌకర్యాలు లేని, అంతర్గత ఘర్షణలు జరిగే మారుమూల ప్రాంతాల్లో ఉండటం వల్ల ల్యాబ్ పరీక్షల నిర్వహణ సవాలుగా మారింది. అందువల్ల ఈ గణాంకాలు ప్రాథమిక సమాచారం,అనుమానిత కేసుల ఆధారంగానే నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు.

‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్..


కాంగో తూర్పు ప్రాంతంలో గత వారం వెలుగుచూసిన ఈ అవుట్‌బ్రేక్‌కు ఎబోలాలోని ‘బుండిబుగ్యో’ (Bundibugyo) స్ట్రెయిన్ కారణమని గుర్తించారు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. ఈ నిర్దిష్ట రకం ఎబోలా స్ట్రెయిన్‌కు ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ గానీ, ఖచ్చితమైన చికిత్సా విధానాలు (Therapeutic treatments) గానీ అందుబాటులో లేవు. నివారణకు ‘ఎర్వెబో’ (Ervebo) అనే వ్యాక్సిన్ ను పరిశీలిస్తున్న ప్పటికీ.. అది క్షేత్రస్థాయిలో అందుబాటులోకి రావడానికి కనీసం మరో రెండు నెలల సమయం పడుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి ఆన్ అన్సియా తెలిపారు.

గతం తాలూకు చేదు జ్ఞాపకాలు.. 

గత అర్ధ శతాబ్ద కాలంలో ఆఫ్రికా ఖండంలో ఎబోలా మహమ్మారి దాదాపు 15,000 మందికి పైగా బలితీసుకుంది. గతంలో 2018, 2020 మధ్య కాలంలో కాంగో దేశంలోనే సంభవించిన అత్యంత ఘోరమైన ఎబోలా వ్యాప్తి సమయంలో.. సుమారు 3,500 కేసులు నమోదు కాగా ఏకంగా 2,300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ చేదు అనుభవాల దృష్ట్యా, ప్రస్తుత వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

సరిహద్దు ప్రాంతాలలో చేతులు శుభ్రం చేసుకోవడం (hand wash), బాధితులను ఐసోలేషన్‌లో ఉంచడం వంటి ముందస్తు జాగ్రత్త చర్యలను కాంగో యంత్రాంగం వేగవంతం చేసింది. అయినప్పటికీ, అంతర్జాతీయ సమాజం సకాలంలో స్పందించి తగిన వైద్య సహాయాన్ని అందించకపోతే ఈ ముప్పు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?న్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.