భారతదేశంలో తొలి మంకీ పాక్స్ (ఎంపాక్స్)కేసు నమోదు..  

సాక్షి లైఫ్ : ఇప్పటివరకూ ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్ (ఎంపాక్స్) భారతదేశంలోకి కూడా ప్రవేశించింది. మొట్టమొదటి మంకీ పాక్స్ కేసు నమోదైంది. మంకీ పాక్స్ (ఎంపాక్స్)లక్షణాలున్న ఓ యువకుడిని గుర్తించింది కేంద్ర ఆరోగ్యశాఖ. ఎంపాక్స్ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఆ యువకుడిలో మంకీ పాక్స్ లక్షణాలున్నట్లు గుర్తించారు. 

ఇది కూడా చదవండి..ఒమేగా-3లో ఎన్నిరకాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి..డెంగ్యూని నిర్మూలించేందుకు కర్ణాటకలో సరికొత్త మార్గదర్శకాలు..

ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

అతడిని వెంటనే ఐసోలేషన్లో ఉంచారు, ఐతే ప్రస్తుతానికి అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నాడు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి నుంచి నమూనాలను సేకరించి, మంకీ పాక్స్ నిర్ధారణ కోసం ల్యాబ్‌కి పంపించామని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, అలాగే, వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా కొనసాగుతోందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ.

భారతదేశంలో మంకీ పాక్స్ కేసు.. 

జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం, ఈ వ్యాధి తీవ్రతపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కాబట్టి దీని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మహమ్మారి మంకీ పాక్స్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని తెలిపింది.

 
తాజా నివేదికలు.. 

ఇటీవల ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ వ్యాప్తి ఆందోళనకరంగా కొనసాగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు 18,000 అనుమానిత కేసులు, 926 మరణాలు సంభవించాయని గణాంకాలు చెబుతున్నాయి. న్యూ వేరియంట్ కేసులు 258 నమోదైనట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆఫ్రికాలోని బురుండీ, రువాండా, కెన్యా, ఉగాండా దేశాల్లోనే కాకుండా, స్వీడన్, థాయ్లాండ్ దేశాల్లో కూడా మంకీ పాక్స్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

ఇది కూడా చదవండి..జుట్టు, చర్మ సంరక్షణకు విటమిన్ "ఇ" చేసే మేలు తెలుసా..?

ఇది కూడా చదవండి..ప్రోటీన్ ఫుడ్ దేనికి ప్రయోజనకరం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : india monkeypox mpox-outbreak mpox mpox-symptoms monkeypox-in-india monkey-pox-in-india monkey-pox-cases-in-india monkey-pox-case-in-india monkey-pox-news-india monkeypox-cases-in-india monkey-pox-cases-in-india-latest-news-in-telugu
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com