ఉచితంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్(హెచ్ పీవీ)వ్యాక్సినేషన్..
సాక్షి లైఫ్ : అపోలో క్యాన్సర్ సెంటర్లు సోమవారం ప్రారంభించిన చొరవ కింద అనాథాశ్రమాలలకు చెందిన దాదాపు 120 మంది బాలికలకు గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఉచిత టీకాలు అందించారు. భారతదేశంలో మహిళల్లో రెండవ అత్యంతగా వచ్చే క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్. దీనికి ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్ పీవీ)తో ఈ టీకా పోరాడుతుంది.
ఇది కూడా చదవండి..తరచుగా ఎక్స్‌రేలు తీయించడంవల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..స్కిన్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
గత సంవత్సరం కేంద్రం ఉచిత హెచ్ పీవీ వ్యాక్సిన్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలి బడ్జెట్ క్యాన్సర్ సంరక్షణపై దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ప్రయత్నం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
జూబ్లీహిల్స్‌లోని అపోలో క్యాన్సర్ సెంటర్లలో బాలికలకు, యువతులకు, మహిళలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీకాలు ఉచితంగా అందించనున్నారు. లబ్ధిదారులు అపోలో క్యాన్సర్ సెంటర్ల నుంచి కూపన్‌లను సేకరించి, కేటాయించిన తేదీ, సమయంలో మొదటి డోస్ తీసుకోవాలి. రెండవ డోస్ అందించడానికి మరొకసారి వారికి ఆయా తేదీ వివరాలు అందిస్తారు.
అపోలో క్యాన్సర్ సెంటర్స్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ..హెచ్ పీవీ టీకా వేయడానికి దాదాపు రూ. 7,000 నుంచి రూ. 8,000 ఖర్చవుతుంది. కానీ పేదవారికి ఇది ఖరీదైనది కాబట్టి వారికి ఫ్రీగా ఇస్తున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి..గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్) అంటే ఏమిటి..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి..హోమియోపతి ఔషధాలతో ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
