భారతదేశంలో తొలిసారిగా బైపాస్ సర్జరీ చేసిన వైద్యుడు కన్నుమూత.. 

సాక్షి లైఫ్ : ప్రముఖ హార్ట్ సర్జన్ డా.కె ఎం చెరియన్ కన్నుమూశారు.1975లో దేశంలో మొట్టమొదటి హార్ట్ బైపాస్ సర్జరీ చేసిన డాక్టర్ కె.ఎం. చెరియన్ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 82 ఏళ్లు. నవజాత శిశువులు, పిల్లలకు క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలు చేశారు డా.కె ఎం చెరియన్. గుండె శస్త్రచికిత్సలకు మార్గదర్శకుడుగా పలు దేశాల్లో సైతం ఆయనకు ఖ్యాతి ఉంది. ఆయన స్థాపించిన ఆసుపత్రుల ద్వారా సూపర్ స్పెషాలిటీ చికిత్సలు అందించారు. ఆయన మృతి పట్ల దేశంలోని వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా సంతాపం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి..తల్లిదండ్రులు చేసే ఈ 5 పనులు వారి పిల్లలను గాయపరుస్తాయి.. 

ఇది కూడా చదవండి..వృద్ధాప్యాన్ని నిరోధించేందుకు 30 ఏళ్ల తర్వాత ఆహారంలో ఎలాంటివి చేర్చుకోవాలి..?

 

ఇది కూడా చదవండి..విటమిన్ బి12 లోపం వల్ల అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ఏమి చేయాలి..? 

ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి..?

 

డాక్టర్ చెరియన్ ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీతో సహా అనేక అవార్డులు అందుకున్నారు. బెంగళూరులో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో స్పృహ కోల్పోయిన ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయన మరణించారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తోపాటు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

దాదాపు 50 సంవత్సరాల క్రితం భారతదేశంలో మొట్టమొదటి కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (సిఏబిజి) శస్త్రచికిత్స చేసిన వైద్యుడిగా డాక్టర్ కె ఎం చెరియన్ గుర్తింపు పొందారు. డాక్టర్ చెరియన్ మరణం పట్ల ప్రధాని మోదీ కూడా విచారం వ్యక్తం చేశారు. ఆయనకు పద్మశ్రీ సహా అనేక అవార్డులు లభించాయి. డాక్టర్ చెరియన్ చెన్నైలోని 100 పడకల కార్డియాక్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటుచేశారు. ఈ ఆసుపత్రిలో భారత దేశంతో పాటు 21 ఇతర దేశాలకు చెందిన చిన్నారులకు చికిత్స అందించారు. ఫ్రాంటియర్ లైఫ్‌లైన్ అనే ఆసుపత్రిని కూడా ఆయనే స్థాపించారు.

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health-news-updates heart-blocks heart-problems heart-problems-cardiologist kids special-needs-children dr.-k.m.-cherian heart-bypass-surgery pioneering-surgeon cardiac-specialist indian-medical-history health-care-pioneers cardiology medical-achievements medical-tributes
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com