సాక్షి లైఫ్ : ప్రపంచాన్ని మరోసారి భయపెడుతున్న ప్రాణాంతక 'మార్బర్గ్ వైరస్ వ్యాధి (Marburg Virus Disease - MVD)' ఆఫ్రికా దేశం ఇథియోపియాలో మొదలైంది. తమ దేశంలో మొట్టమొదటిసారిగా ఈ అత్యంత అరుదైన, తీవ్రమైన వైరల్ హెమరేజిక్ జ్వరం వ్యాప్తిని గుర్తించినట్లు ఇథియోపియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి, వ్యాధి మూలాలను కనుగొనడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహకారంతో యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తు చర్యలు ప్రారంభమయ్యాయి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
మరణాల రేటు..
ఇథియోపియాలోని దక్షిణ ప్రాంతంలో సౌత్ ఒమో రీజియన్, జింకా పట్టణంలో ఇప్పటివరకు 12 కేసులు నమోదయ్యాయని ధృవీకరించారు.
ఈ కేసులలో ఎనిమిది మంది మరణించినట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 88శాతం వరకు ఉండవచ్చు. మార్బర్గ్ వైరస్.. ఎబోలా వైరస్ వలె అదే ఫిలోవైరిడే కుటుంబానికి చెందినది. ఈ రెండు వ్యాధులు వైద్యపరంగా ఒకే విధమైన లక్షణాలను చూపుతాయి.
ఇది ఎలా వ్యాపిస్తుంది..?
మార్బర్గ్ వైరస్ ప్రధానంగా పండ్ల గబ్బిలాలలో (Fruit Bats) ఉంటుంది. పండ్ల గబ్బిలాలు నివసించే గుహలు లేదా గనుల్లోకి వెళ్లినప్పుడు వాటి స్రావాల ద్వారా మానవులకు వ్యాప్తి చెందుతుంది. ఒకసారి మనిషికి సోకిన తర్వాత, రోగి శరీర ద్రవాలు,రక్తం, లాలాజలం, వాంతులు,లేదా వైరస్ కలుషితమైన వస్తువులను పరుపు, దుస్తులు తాకడం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.
లక్షణాలు..?
వైరస్ సోకిన 2 నుంచి 21 రోజుల మధ్య లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. తీవ్రమైన అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, తీవ్రమైన అలసట. తీవ్ర లక్షణాలు.. వాంతులు, అతిసారం, ముక్కు, చిగుళ్ళు, కళ్ళు లేదా అంతర్గత అవయవాల నుండి తీవ్రమైన రక్తస్రావం (Hemorrhagic manifestations). చివరి దశల్లో షాక్, అవయవ వైఫల్యం, ప్రాణాంతకం కావచ్చు. టీకా లేదు.. చికిత్స సహాయకమే..! ప్రస్తుతం మార్బర్గ్ వైరస్‌కు వ్యతిరేకంగా ఆమోదించిన నిర్దిష్ట చికిత్స (Specific Treatment) లేదా టీకా (Vaccine) అందుబాటులో లేదు. చికిత్స ప్రధానంగా లక్షణాల ఉపశమనం,సహాయక సంరక్షణ (Supportive Care) పైనే ఆధారపడి ఉంటుంది.
వ్యాప్తిని నియంత్రించడానికి రోగులను త్వరగా గుర్తించడం, ఐసోలేట్ చేయడం, కాంటాక్ట్ ట్రేసింగ్ (బాధితులతో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించడం) కఠినమైన ఇన్ఫెక్షన్ నివారణ చర్యలు (IPC) పాటించడం చాలా ముఖ్యమని WHO స్పష్టం చేసింది.
ఇథియోపియా ఇప్పటికే కలరా, డెంగ్యూ వంటి పలు వ్యాధులతో పోరాడుతున్నందున, మార్బర్గ్ వ్యాప్తిని నియంత్రించడం ఒక పెద్ద సవాలుగా మారింది. పొరుగు దేశాలైన కెన్యా, దక్షిణ సూడాన్‌లకు కూడా ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com