Gas Shortage : గ్యాస్ కొరతతో హెల్త్ సెక్టార్ పై తీవ్ర ప్రభావం.. 

సాక్షి లైఫ్ : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యుడి ఆరోగ్యానికి సెగ తగిలేలా చేస్తున్నాయి. ఎల్‌పీజీ (LPG), పెట్రో రసాయనాల సరఫరాపై విధించిన ఆంక్షలు దేశీయ ఫార్మా రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వంటగ్యాస్ అవసరాల కోసం పారిశ్రామిక వినియోగానికి కోత విధించడంతో.. జ్వరం వస్తే వేసుకునే పారాసిటమాల్‌ నుంచి ఆసుపత్రుల్లో వినియోగించే సిరంజిలు, గ్లౌజుల వరకు అన్నింటికీ కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.

 

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

తగ్గిన ఉత్పత్తి..  

ఔషధాల తయారీలో బాయిలర్లు, స్టెరిలైజేషన్ వంటి కీలక ప్రక్రియలకు ఎల్‌పీజీ, పీఎన్‌జీ గ్యాస్ వాడతారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (MSME) ఫార్మా కంపెనీలు పూర్తిగా గ్యాస్ ఆధారంగానే నడుస్తున్నాయి. ప్రస్తుతం సరఫరాలో రేషనింగ్ విధించడంతో ఉత్పత్తి కుంటుపడింది. చాలా కంపెనీల వద్ద కేవలం 15 నుంచి 30 రోజుల వరకు మాత్రమే నిల్వలు ఉన్నాయని, పరిస్థితి ఇలాగే ఉంటే మరో రెండు నెలల్లో మార్కెట్లో మందుల కొరత స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముడి పదార్థాలు సైతం కొరత.. 

కేవలం గ్యాస్ మాత్రమే కాకుండా, పెట్రో రసాయనాల కొరత కూడా పరిశ్రమను వేధిస్తోంది. మందుల కోటింగ్ కోసం వాడే 'ఐసో ప్రొపైల్ ఆల్కహాల్' (IPA) తయారీకి అవసరమైన రిఫైనరీ గ్రేడ్ ప్రొపెలైన్‌ సరఫరా నిలిచిపోయింది. దేశీయంగా రిలయన్స్ వంటి సంస్థలు గృహ అవసరాల కోసం వీటి ఉత్పత్తిని మళ్లించడంతో ఐపీఏ తయారీదారులు ఇబ్బందుల్లో పడ్డారు. అలాగే సిరంజిలు, పీపీఈ కిట్లు, గ్లౌజుల తయారీకి వాడే బెంజీన్ కొరత కూడా తీవ్రంగా ఉంది.

కేంద్రానికి ఫార్మా సంస్థల విన్నపం..  

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (IPA), ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (IDMA) వంటి సంస్థలు కేంద్ర వాణిజ్య, పెట్రోలియం శాఖలకు లేఖలు రాశాయి. కోవిడ్ సమయంలో ఇచ్చినట్లే ఔషధ రంగానికి 'ఎసెన్షియల్ కొమోడిటీస్' (Essential Commodities)కింద మినహాయింపులు ఇవ్వాలని, గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నాయి ఆయా కంపెనీలు.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : health-news-updates gas-problem
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com