New COVID Variant ‘Cicada’ : కరోనా కొత్త వేరియంట్ 'సికాడా' ప్రాణాంతకమైందా..? ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
సాక్షి లైఫ్ : వైద్య పరిభాషలో దీనిని BA.3.2 గా పిలుస్తారు. ఇది ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన ఒక ఉప రకం. 2024 నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో తొలిసారిగా బయటపడిన ఈ వేరియంట్, ప్రస్తుతం అమెరికా సహా దాదాపు 23 దేశాలకు విస్తరించింది.పాత కోవిడ్ లక్షణాలే ఈ కొత్త వేరియంట్ సికాడాలోనూ కనిపిస్తున్నప్పటికీ, కొన్ని మార్పులున్నాయి.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ముఖ్యమైన లక్షణాలు ఇవే..
పాత కోవిడ్ లక్షణాలే ఈ కొత్త వేరియంట్ సికాడాలోనూ కనిపిస్తున్నప్పటికీ, కొన్ని మార్పులున్నాయి. తీవ్రమైన గొంతు నొప్పి..ఈ వేరియంట్‌లో గొంతు నొప్పి చాలా తీవ్రంగా, ఇబ్బందికరంగా ఉంటోంది. ముక్కు కారడం లేదా ముక్కు మూసుకుపోవడం. జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు, అలసటతో కూడిన జ్వరం. కొంతమందిలో స్వల్పంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. రుచి, వాసన కోల్పోవడం.. మునుపటి వేరియంట్ల లాగే ఈ రకంలోనూ కనిపిస్తోంది.
ప్రమాదకరమా..?
ప్రస్తుతానికి దీనిని ప్రమాదకరమైనదిగా కాకుండా, కేవలం 'వేరియంట్ అండర్ మానిటరింగ్' గానే ప్రపంచ ఆరోగ్య సంస్థ, సిడిసి పరిగణి స్తున్నాయి. దీనిలోని జన్యు మార్పుల వల్ల ఇది వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఒకసారి కోవిడ్ వచ్చిన వారికి కూడా మళ్లీ సోకే ప్రమాదం ఉంది.
ఎలాంటి వారికి ఇబ్బంది..?
వృద్ధులు, గర్భిణీలు, ఇతర ఆరోగ్య సమస్యలు బిపి, షుగర్ వంటివి ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
