World Tuberculosis Day 2026 : మందులున్నా తగ్గని 'టీబీ '.. లోపాలు ఎక్కడ ఉన్నాయి..?  

సాక్షి లైఫ్ : సుప్రసిద్ధ రచయిత జార్జ్ ఆర్వెల్ తన చిట్టచివరి రచన '1984' పూర్తి చేసే క్రమంలో టీబీ వ్యాధితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. అది 1948 నాటి మాట. ప్రస్తుతం 2026లో ఉన్నాం. విజ్ఞానశాస్త్రం ఎంతో పురోగమించింది, మందులు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఆర్వెల్ నాటి ఆ 'నిశ్శబ్ద మహమ్మారి' నేటికీ లక్షలాది మంది ఊపిరితిత్తులను కబళిస్తూనే ఉంది. 'టీబీని అంతం చేద్దాం' అనే నినాదం కాగితాలకే పరిమితమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి తాజా గణాంకాలు. మర్చి 24వతేదీన వరల్డ్ టీబీ డే సందర్భంగా సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం..  

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

ఆరు నెలల్లోనే ఉపశమనం.. కానీ..!

ఒకప్పుడు డ్రగ్ రెసిస్టెంట్ టీబీ (DR-TB) సోకితే రెండేళ్ల పాటు వేల సంఖ్యలో మాత్రలు మింగాల్సి వచ్చేది. ఇంజెక్షన్ల వల్ల వినికిడి లోపం వంటి దుష్ప్రభావాలు తప్పేవి కావు. అయితే, శాస్త్రవేత్తలు కనిపెట్టిన 'బి.పి.ఎ.ఎల్.ఎం' (BPaLM) అనే నూతన చికిత్సా విధానం ఒక అద్భుతమనే చెప్పాలి. కేవలం ఆరు నెలల కాలంలోనే, అదీ కేవలం నోటి మాత్రలతోనే వ్యాధిని నయం చేసే అవకాశం దక్కింది. అయితే, వైద్యం అందుబాటులో ఉన్నా.. రోగికి సామాజిక మద్దతు కరువవుతోంది. వ్యాధి నయమైనా, ఆ క్రమంలో కోల్పోయిన ఉపాధి, సమాజం చూపే వివక్ష రోగిని కుంగదీస్తున్నాయి.

పురుషుల్లోనే అధికం.. ఎందుకిలా..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం.. టీబీ బారిన పడుతున్న వారిలో 55 శాతం మంది పురుషులే. మహిళలు 33 శాతం, చిన్నారులు 12 శాతం మేర ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పురుషులు ఇంటికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండటం వల్ల, అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పని మానేస్తే ఇల్లు గడవదనే ఆందోళన, సామాజిక ముద్ర వారిని ఆసుపత్రి గడప తొక్కనివ్వడం లేదు. ఫలితంగా వ్యాధి ముదిరిన తర్వాతే చికిత్సకు వస్తున్నారు.

అనుబంధ వ్యాధుల ముప్పు.. 

టీబీని కేవలం ఒక ఊపిరితిత్తుల వ్యాధిగా చూడటం మన ఆరోగ్య వ్యవస్థ చేస్తున్న అతిపెద్ద పొరపాటు. ఇది ఇతర వ్యాధులతో కలిసి రోగిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. షుగర్ ఉన్నవారికి టీబీ సోకే ప్రమాదం 2 నుంచి 3 రెట్లు ఎక్కువ. హెచ్.ఐ.వి బాధితులకు టీబీ సోకే అవకాశం సాధారణ వ్యక్తుల కంటే 16 రెట్లు అధికం. సరైన  పోషకాహారం అందక పోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి టీబీ త్వరగా విస్తరిస్తోంది.

మార్పు ఎక్కడ రావాలి..?

కేవలం ఆసుపత్రుల్లో మందులు ఇస్తే సరిపోదు. పని ప్రదేశాల్లోనే పరీక్షలు, సరళమైన చికిత్సా సమయాలు, మానసిక ధైర్యం కల్పించే వ్యవస్థ కావాలి. వైద్యం కేవలం ఊపిరితిత్తులకే కాదు, ఆ మనిషి బతుకుదెరువుకు కూడా భరోసానివ్వాలి. అప్పుడే 'టీబీ రహిత ప్రపంచం' సాధ్యమవుతుంది.

 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : tb-symptoms world-tb-day causes-of-tuberculosis what-causes-tuberculosis treatment-of-tuberculosis
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com