Says ICMR-NIN : అనారోగ్య ఆహారమే.. 56 శాతం రోగాలకు కారణం..! ‘డైట్’ మార్చాలంటున్న ICMR-NIN..
సాక్షి లైఫ్ : మనం తినే తిండే మన ఆరోగ్యానికి గీటురాయి. కానీ, నేటి కాలంలో అది శాపంగా మారుతోంది. దేశంలో సంభవిస్తున్న మొత్తం వ్యాధుల్లో 56 శాతం కేవలం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లే వస్తున్నాయని ఐసీఎంఆర్ (ICMR) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సంచలన నివేదికను వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు తమ ఆహార ఎంపికలపై పునరాలోచించాలని కోరుతూ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
పెనుముప్పుగా మారుతున్న అలవాట్లు..
మధుమేహం (Diabetes), రక్తపోటు (Hypertension), గుండె జబ్బుల వంటి జీవనశైలి వ్యాధులకు ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమేనని ఈ సంస్థ స్పష్టం చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆహార పద్ధతులు పూర్తిగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. శుద్ధి చేసిన పిండి పదార్థాలు (Refined Cereals), వేపుళ్లు, చక్కెర పానీయాలు, అతిగా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌ను ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు.
పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, తాజా పండ్లు, గింజలు, తృణధాన్యాల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు అందక, అనవసరమైన క్యాలరీలు పెరిగిపోతున్నాయి. తత్ఫలితంగా ఒకవైపు రక్తహీనత (Anaemia), మరోవైపు అధిక బరువు సమస్యలు ఒకేసారి పలకరిస్తున్నాయి.
ఆరోగ్యానికి 17 సూత్రాలు..
ఆహార లోపాలను సవరించేందుకు ఎన్.ఐ.ఎన్ (NIN) మొత్తం 17 రకాల సిఫార్సులను చేసింది. భోజనంలో కేవలం ధాన్యాలే కాకుండా పప్పులు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. కాలానుగుణంగా దొరికే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పాలు, పెరుగు, గుడ్లు వంటివి మితంగా తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని, అతిగా ప్రాసెస్ చేసిన పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాలి.
సమతుల్య ఆహారం..!
ఏ ఒక్క ఆహార పదార్థం కూడా శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందించలేదని, అందుకే సమతుల్య ఆహారం (Balanced Diet) తప్పనిసరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి తోడు క్రమబద్ధమైన వ్యాయామం, బరువు నియంత్రణ అత్యవసరమని సూచిస్తున్నారు.
మొత్తం వ్యాధుల భారంలో 56 శాతం ఆహారంతోనే ముడిపడి ఉందంటే.. మనం కిచెన్‌లో చేసే ఎంపికలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని అర్థం చేసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. మన ప్లేట్‌లో చేసే చిన్నపాటి మార్పులు, దీర్ఘకాలంలో ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది వేస్తాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిపుణులు వెల్లడిస్తున్నారు.. ఈ మార్గదర్శకాలు కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా పాఠశాలలు, కార్యాలయాల్లో కూడా అమలు చేయాలని ఐసీఎంఆర్ వెల్లడిస్తోంది.
ఇది కూడా చదవండి..Diabetes or High Blood Pressure : డయాబెటిస్ లేదా బీపీ ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
