అక్కడ మళ్ళీ పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు..
సాక్షి లైఫ్ : ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో స్వైన్ ఫ్లూ కేసులు వేగంగా పెరుగు తున్నాయి. ఢిల్లీతో పాటు మొత్తం ఉత్తర భారతంలో చలి తగ్గుముఖం పడుతోంది. ఒకవైపు ప్రజలు చలి నుంచి ఉపశమనం పొందుతుండగా మరోవైపు "స్వైన్ ఫ్లూ" కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హెచ్1ఎన్1 ఫ్లూను "స్వైన్ ఫ్లూ" కూడా అంటారు. ఇది ఇన్ఫ్లుఎంజా ఏ వైరస్ సబ్ వేరియంట్. ఈ కేసులు పెరగడానికి వెనుక కారణాలు ఏమిటంటే..?
ఇది కూడా చదవండి.. ఎండాకాలంలో వచ్చే చర్మ సమస్యలను ఎలా నివారించాలంటే..?
ఢిల్లీ-ఎన్సీఆర్లో స్వైన్ ఫ్లూ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఈ ఇన్ఫెక్షన్ కేసులు పెరిగాయి. ఇది అంటువ్యాధి. శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. టీకా తీసుకున్న వారి శాతం తగ్గడం, ఇన్ఫెక్షన్పై అవగాహన లేకపోవడం, సరైన ఆరోగ్య సంరక్షణ లేకపోవడం వంటి అనేక అంశాలు స్వైన్ ఫ్లూ కేసుల పెరుగుదలకు కారణమవుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కావాలంటే..ఈ విత్తనాలు తినాలి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
