Ebola Virus : ఎబోలా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన..
సాక్షి లైఫ్ : ఇటీవల డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లో కలకలం రేపుతున్న ఎబోలా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక వివరాలను వెల్లడించింది. సాధారణంగా అత్యంత ప్రాణాంత కమైనదిగా భావించే ఈ వైరస్ తీవ్రత, ప్రస్తుత ముప్పులో కొంత తక్కువగానే నమోదవుతుండటం గమనార్హం. సాధారణంగా ఎబోలా బారిన పడితే మరణాల రేటు అత్యధికంగా ఉంటుంది. అయితే, కాంగోలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉధృతిలో మరణాల శాతం 25 శాతం కంటే తక్కువగానే నమోదవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో స్పష్టం చేసింది. మే 15వ తేదీ నుంచి ఇప్పటివరకు అక్కడ సుమారు 1,000 కి పైగా అనుమానిత, ధృవీకరించిన ఎబోలా కేసులు వెలుగుచూశాయి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
మరణాల వివరాలు..
ఇప్పటివరకు లభించిన గణాంకాల ప్రకారం 10 మంది ఎబోలాతో మరణించినట్లు నిర్ధారణ కాగా, మరో 223 మరణాలు ఈ వైరస్ వల్లే సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
పొరుగు దేశాలకూ వ్యాప్తి..
కాంగో సరిహద్దులు దాటి ఈ వైరస్ పక్కనే ఉన్న ఉగాండాకూ పాకింది. అక్కడ ఒకరు మరణించగా, మరో ఆరుగురికి ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ వైరస్ మనం అంచనా వేస్తున్న దానికంటే ఎక్కువే వ్యాపించి ఉండవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోంది.
వైరస్ స్ట్రెయిన్ మారడమే కారణమా..?
గతంలో కాంగోలో సంభవించిన 16 ఎబోలా ఉధృతులతో పోలిస్తే ఈసారి మరణాల రేటు చాలా తక్కువ. గతంలో ఎక్కువగా 'జైర్ (Zaire)' అనే అత్యంత ప్రమాదకరమైన స్ట్రెయిన్ వల్ల రోగులు ప్రాణాలు కోల్పోయేవారు. దీని మరణాల రేటు 60 నుంచి 90 శాతం వరకు ఉండేది. కానీ, ప్రస్తుత వ్యాప్తికి 'బుండిబుగ్యో (Bundibugyo)' అనే భిన్నమైన స్ట్రెయిన్ కారణమని వైద్య నిపుణులు గుర్తించారు.
గతంలో (2007, 2012లో) ఈ స్ట్రెయిన్ కనిపించినప్పుడు మరణాల రేటు 30 నుంచి 50 శాతంగా ఉండేది. ప్రస్తుతం అనుమానిత కేసుల్లో ఈ మరణాల రేటు 24.6 శాతంగా, పూర్తిగా నిర్ధారణ అయిన కేసుల్లో కేవలం 9.8 శాతంగానే ఉండటం గమనార్హం. అయితే, జైర్ స్ట్రెయిన్‌కు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రస్తుత బుందిబుగ్యో స్ట్రెయిన్‌కు మాత్రం ఇంకా ఎలాంటి ప్రత్యేక వ్యాక్సిన్లు లేదా చికిత్సలు అందుబాటులో లేవు.
ముందస్తు చికిత్స..!
ఎబోలా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న కొద్దీ మరణాల రేటులో మార్పులు రావడం సహజం. రోగులను త్వరగా గుర్తించి, సకాలంలో వైద్యం అందించడం వల్ల మరణాలను గణనీయంగా తగ్గించవచ్చు. ఎబోలా విషయంలో 'ముందస్తు గుర్తింపు,తక్షణ చికిత్స' మాత్రమే ప్రాణాలు కాపాడుతుందని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర స్పందన విభాగం డైరెక్టర్, అబ్ది రెహమాన్ మహముద్ చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
