Rohini Karthi : రోహిణీ కార్తె సమయంలో వంకాయ తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా..? 

షేర్ చేయండి:
Rohini Karthi : రోహిణీ కార్తె సమయంలో వంకాయ తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా..? 

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. రోహిణీ కార్తె ప్రవేశంతో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరింది. ముఖ్యంగా మే 25 నుంచి జూన్ 2 వరకు సాగే ఈ 'నౌతప' అంటే ..? సంవత్సరంలోనే అత్యంత వేడిగా ఉండే 9 రోజులు. ఈ సమయంలో సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ పైగా నమోదవుతాయి. ఈ తీవ్రమైన వడగాలుల నేపథ్యంలో ఆహార విహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

 

అయితే, ఈ తొమ్మిది రోజుల కాలంలో వంకాయ తినకూడదని పెద్దలు, వైద్యులు చెబుతుంటారు. అసలు వంకాయ తింటే ఏమవుతుంది..? దీనివల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

వంకాయతో కిడ్నీలో రాళ్ల ముప్పు..?

వైద్య శాస్త్రం ప్రకారం.. వంకాయల్లో 'ఆక్సలేట్లు' (Oxalates) సహజంగానే కాస్త ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఎండల తీవ్రత వల్ల వేసవిలో మన శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఆక్సలేట్లు ఎక్కువగా ఉండే వంకాయ వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే, అవి శరీరంలో పేరుకుపోయి 'కాల్షియం ఆక్సలేట్' రాళ్లుగా మారే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి, ఇప్పటికే కిడ్నీ సమస్యలు లేదా కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఈ సమయంలో వంకాయకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

ఆయుర్వేదం ఏం చెబుతోంది..?

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. వంకాయ 'ఉష్ణ' గుణాన్ని కలిగి ఉంటుంది. నౌతప సమయంలో బయట వాతావరణం ఇప్పటికే చాలా వేడిగా ఉంటుంది. దీనికి తోడు వంకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో అంతర్గత వేడి మరింత పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను మందగించేలా చేసి.. గుండెల్లో మంట, అసిడిటీ, గ్యాస్ వంటి కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

ఎవరెవరు దూరంగా ఉండాలి..?

అలర్జీ బాధితులు.. వంకాయలోని కొన్ని సమ్మేళనాలు అలర్జీలను ప్రేరేపిస్తాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వంకాయ తింటే చర్మం ఎర్రబడటం, దురద, దద్దుర్లు లేదా వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పైల్స్ ఉన్నవారు.. తీవ్రమైన వేడి చేసే ఆహారాల వల్ల పైల్స్ సమస్య ఉన్నవారిలో అసౌకర్యం, నొప్పి పెరిగే ప్రమాదం ఉంది.

కిడ్నీలో రాళ్ల చరిత్ర ఉన్నవారు.. వీరు ఈ 9 రోజులు వంకాయకు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. రోహిణి కార్తె సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోండి.. దాహం వేసినా, వేయకపోయినా రోజంతా పుష్కలంగా నీరు తాగుతుండాలి. కేవలం నీళ్లే కాకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి సహజ పానీయాలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందుతాయి.

మసాలాలు తగ్గించండి.. ఎండ వేళల్లో ప్రయాణాలు వద్దు..

 వేయించిన, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. కాబట్టి తేలికగా అరిగే చలవచేసే ఆహారాన్ని ఎంచుకోండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసర మైతే తప్ప బయటకు వెళ్లకండి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తలపై గుడ్డ లేదా గొడుగు తప్పనిసరిగా వాడండి. కాఫీ, టీలు, కార్బోనేటెడ్ డ్రింక్స్,ఆల్కహాల్ శరీరంలో నీటి శాతాన్ని వేగంగా తగ్గించి డీహైడ్రేట్ చేస్తాయి. కాబట్టి ఈ రోజుల్లో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

 

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.