Salmonella Outbreak : సూపర్‌ఫుడ్' సప్లిమెంట్ల వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తి.. అమెరికాలో 36 రాష్ట్రాలకు పాకిన వైనం..!

షేర్ చేయండి:
Salmonella Outbreak : సూపర్‌ఫుడ్' సప్లిమెంట్ల వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తి.. అమెరికాలో 36 రాష్ట్రాలకు పాకిన వైనం..!

సాక్షి లైఫ్ : ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని భావించే కొన్ని రకాల 'సూపర్‌ఫుడ్' సప్లిమెంట్లు, పోషకాహార మాత్రలు, పొడులు ఇప్పుడు అమెరికాలో ఆందోళనకు కారణమవుతున్నాయి. వీటిని వాడటం వల్ల ప్రమాదకరమైన 'సాల్మొనెల్లా' (Salmonella) బ్యాక్టీరియా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అమెరికా వ్యాప్తంగా ఇప్పటికే 36 రాష్ట్రాల్లో ఈ ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్లు అక్కడి ఆరోగ్య నియంత్రణ సంస్థలైన సీడీసీ (CDC), ఎఫ్‌డీఏ (FDA) వెల్లడించాయి. ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తికి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

సప్లిమెంట్ల వెనక్కి పిలుపు (Recall).. 

ఆన్‌లైన్ వేదికలైన అమెజాన్, వాల్‌మార్ట్, టార్గెట్ వంటి ప్రముఖ సంస్థల ద్వారా విక్రయించిన కొన్ని బ్రాండ్ల 'మునగాకు క్యాప్సూల్స్' (Moringa Capsules), గ్రీన్ సూపర్‌ఫుడ్ పౌడర్లలో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో అప్రమత్తమైన కొన్ని ప్రముఖ సప్లిమెంట్ కంపెనీలు (Moto Moringa LLC, Total Nutrition Inc.) మార్కెట్లోకి విడుదల చేసిన తమ ఉత్పత్తులను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు (Recall) ప్రకటించాయి.

సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన 6 గంటల నుంచి 6 రోజుల లోపు లక్షణాలు బయటపడతాయి.

తీవ్రమైన విరేచనాలు, కొన్నిసార్లు రక్తంతో కూడినవి. 

విపరీతమైన జ్వరం, కడుపునొప్పి, 

వాంతులు, డీహైడ్రేషన్

సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారు 4 నుంచి 7 రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్ నుండి కోలుకుంటారు. అయితే, ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది సోకితే పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించిన బ్రాండ్ల సప్లిమెంట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు. వాటిని వెంటనే పారేయడం లేదా కొన్న స్టోర్లలో తిరిగి ఇచ్చేయడం మంచిది. ఈ మాత్రలు లేదా పొడులు తగిలిన వంటగది ఉపరితలాలు, పాత్రలను వేడి నీరు, సబ్బుతో శుభ్రంగా కడగాలి. ఈ లక్షణాలు తీవ్రంగా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.