NFHS-6 Survey : తెలంగాణలో పెరుగుతున్న ఊబకాయం, మధుమేహం ముప్పు..! ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6 సర్వేలో కీలక విషయాలు..

షేర్ చేయండి:
NFHS-6 Survey : తెలంగాణలో పెరుగుతున్న ఊబకాయం, మధుమేహం ముప్పు..! ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6 సర్వేలో కీలక విషయాలు..

సాక్షి లైఫ్ : తెలంగాణ సమాజంలో జీవనశైలి మార్పులు పసిపిల్లల నుండి పెద్దల వరకు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పౌష్టికాహార లోపం, మహిళా సాధికారత వంటి సామాజిక సూచీల్లో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధిస్తున్నప్పటికీ.. స్థూలకాయం (obesity), మధుమేహం (diabetes) వంటి సమస్యలు పురుషులు, మహిళల్లో ఆందోళనకరంగా పెరుగుతున్నాయని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) నివేదిక స్పష్టం చేసింది. మే 29న హైదరాబాద్‌లో వెల్లడైన ఈ సర్వే వివరాల ప్రకారం.. తెలంగాణరాష్ట్రంలో ఆరోగ్య ముప్పు ఏ స్థాయిలో పొంచి ఉందో చూద్దాం..  

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

మగవారికంటే మహిళల్లోనే 'చక్కెర' ముప్పు ఎక్కువ..!

తెలంగాణరాష్ట్రంలో రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతున్నట్లు సర్వే గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. విచిత్రంగా పురుషులతో పోలిస్తే మహిళలే ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నారు.

మహిళల్లో..గతంలో అధిక చక్కెర స్థాయిలు కలిగి ఉండి లేదా మధుమేహానికి మందులు వాడుతున్న మహిళల శాతం 14.7% ఉండగా, అది ఇప్పుడు 19.6 శాతానికి పెరిగింది.

పురుషుల్లో..పురుషులలో ఈ రేటు గతంలో 18.1% ఉండగా, ప్రస్తుతం అది 24.5 శాతానికి చేరుకుంది.

పెను సవాల్‌గా మారుతున్న 'స్థూలకాయం'.. 

ఆహారపు అలవాట్లలో లోపాలు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల రాష్ట్రంలో స్థూలకాయుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

15 నుంచి 49 ఏళ్ల వయస్సు గల మహిళల్లో అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడేవారి శాతం 30.1% నుంచి 36.3 శాతానికి పెరిగింది.

పురుషులలో సైతం ఇదే ధోరణి కనిపిస్తోంది. అధిక బరువు ఉన్న పురుషుల సంఖ్య 32.4% నుంచి 35.5 శాతానికి చేరింది.

 తగ్గిన బీపీ (Hypertension)..

ఊబకాయం, షుగర్ పెరుగుతున్నప్పటికీ.. రక్తపోటు (bp) సమస్యలు కాస్త తగ్గడం గమనార్హం. మహిళల్లో హైపర్‌టెన్షన్ రేటు 26.1% నుండి 24.2 శాతానికి తగ్గగా, పురుషులలో ఇది 31.4% నుండి 28.2 శాతానికి క్షీణించింది.

చిన్నారుల్లో తగ్గిన పౌష్టికాహార లోపం.. మెరుగైన వ్యాక్సినేషన్..!

చిన్నారుల ఆరోగ్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాలు గణనీయంగా తగ్గాయి.

 వయస్సుకు తగ్గ ఎదుగుదల లేని పిల్లల శాతం 33.1% నుండి 27 శాతానికి తగ్గింది. తక్కువ బరువు (Underweight).. వయస్సుకు తగ్గ బరువు లేని పిల్లల సంఖ్య 31.8% నుండి 27.8 శాతానికి పడిపోయింది.

తీవ్రమైన క్షీణత (Severe Wasting): తీవ్ర పోషకాహార లోపంతో బాధపడే పిల్లలు 8.5% నుండి 3.9 శాతానికి తగ్గడం విశేషం.

వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతమైంది. 12-23 నెలల వయస్సు గల పిల్లల్లో సంపూర్ణ టీకాల కవరేజ్ 79.1% నుండి 80.9 శాతానికి పెరిగింది. తట్టు (మీజిల్స్) వ్యాక్సిన్ 92.9 శాతానికి, హెపటైటిస్-బి పుట్టిన వెంటనే వేసే డోస్ కవరేజ్ 73.9% నుండి 88.9 శాతానికి మెరుగైంది.

రీప్రొడక్టివ్ హెల్త్..

సంతానోత్పత్తి ధోరణులను మారుస్తున్న 'ఏఐ'..

జీవనశైలి మార్పులు, ఆలస్యపు వివాహాల కారణంగా దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి (fertility) ధోరణులలో పెను మార్పులు వస్తున్నాయని మెర్క్ హెల్త్‌కేర్ ప్రతినిధి అలెగ్జాండర్ స్టెయిన్‌బాచ్ తెలిపారు. పిసిఓఎస్ (PCOS), థైరాయిడ్ వంటి సమస్యలు మహిళల్లో రీప్రొడక్టివ్ హెల్త్‌ను దెబ్బతీస్తున్నాయి. చాలామంది 40 ఏళ్ల వరకు సంతానాన్ని వాయిదా వేసుకోవచ్చని భావిస్తారు, కానీ 35 ఏళ్ల నుండే ఫెర్టిలిటీ రేటు క్రమంగా తగ్గుతుందని ఆయన హెచ్చరించారు.

ఈ క్రమంలో కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత ఫెర్టిలిటీ కేర్‌లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. పిండం ఎంపిక (Embryo selection), ల్యాబ్ ఆటోమేషన్, రోగులకు కౌన్సిలింగ్ ఇవ్వడంలో ఏఐ టూల్స్ వైద్యులకు ఎంతగానో సహాయపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

పెరిగిన మహిళా సాధికారత, ఇంటర్నెట్ వినియోగం..

ఆరోగ్య సూచీలతో పాటు సామాజికంగానూ మహిళలు ముందడుగు వేస్తున్నారు. కుటుంబ నిర్ణయాల్లో భాగస్వామ్యమయ్యే మహిళల సంఖ్య 89.9 శాతానికి పెరిగింది. అలాగే స్వంత బ్యాంక్ ఖాతాలు ఉన్న మహిళలు 92.3 శాతానికి చేరారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ వాడకం ఊహించని విధంగా పెరిగింది. మహిళల్లో ఇంటర్నెట్ వినియోగం 26.5% నుండి 64.8 శాతానికి పెరగ్గా, పురుషులలో ఇది ఏకంగా 50% నుండి 87.3 శాతానికి దూసుకెళ్లింది.

మధుమేహం, ఊబకాయం ముప్పు నుంచి తప్పించుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత ఆవశ్యకమని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.