పచ్చి మామిడికాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య  ప్రయోజనాలు..  

సాక్షి లైఫ్: పచ్చి మామిడికాయ చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. పచ్చిమామిడి సరైన పరిమాణంలో తింటే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వేసవిలో తలెత్తే సమస్యలను ఇందులో ఉండే పోషకాలు నివారిస్తాయి. పచ్చి మామిడి వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

 గట్ హెల్త్.. 


పచ్చి మామిడిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ,పేగు ఆరోగ్యం (గట్ హెల్త్)కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు మామిడికాయ డీహైడ్రేషన్ సమస్యను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. వేసవి కాలం అంటే మామిడికాయలు తినే కాలం. పచ్చి మామిడి ముక్కలపై కారం,ఉప్పు కలిపి తింటే అబ్బా..! ఆ టేస్టే వేరు.  

 ఇది కూడా చదవండి.. పిల్లలకు ఎలాంటి అలవాట్లు నేర్పించాలి..?

  
కాబట్టి, వేసవిలో పచ్చి మామిడి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. మామిడి పన్నా, పచ్చి మామిడికాయ, పుదీనా, కొత్తిమీర చట్నీ, పప్పులో వేసుకుని కూడా తినవచ్చు.  

డీహైడ్రేషన్ సమస్య.. 

వేసవిలో శరీరం నుంచి ఎక్కువ చెమట పట్టడం లేదా తక్కువ నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. అటువంటి పరిస్థితిలో, పచ్చి మామిడితో చేసిన పచ్చి మామిడికాయ పన్నా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. 

సన్ హీట్, సన్ స్ట్రోక్, డీహైడ్రేషన్ నుంచి రక్షించే లక్షణాలను కలిగి ఉన్నందున, ఇది వేసవిలో చాలా ప్రయోజనకరమైన పానీయంగా పరిగణిస్తారు. ఇది శరీరంలో సోడియం వంటి ఎలక్ట్రోలైట్ల లోపాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది. తద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది.

 ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?  


కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పచ్చి మామిడి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు రక్తపోటును నిర్వహించడంలో కూడా ఉపయోగపడుతుంది. దీని కారణంగా, ఇది స్ట్రోక్ ,గుండెపోటును నివారించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.పచ్చి మామిడిని తీసుకోవడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి, ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

ఉదర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. వేసవి కాలంలో కడుపు ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చి మామిడికాయ తీసుకోవడం చాలా అవసరం. ఇది గ్యాస్ట్రో-ఇంటెస్టినల్ డిజార్డర్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది.

పేగు ఆరోగ్యానికి మేలు.. 

పచ్చి మామిడిని తీసుకోవడం వల్ల కొవ్వు శోషణ పెరుగుతుంది. తద్వారా హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల, పచ్చి మామిడిని తీసుకోవడం వల్ల కాలేయం,ప్రేగు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.  

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : gut-health summer-health-tips summer-season summer summer-health summer-drnks summer-tips summer-alert summer-heat raw-mango raw-mango-health-benefits health-benefits-of-raw-mango
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com