సాక్షి లైఫ్ : ఏ సీజన్ లో లభించే పండ్లను ఆ సీజన్ లో తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవి కాలంలో అందుబాటులో ఉండే కొన్ని రకాల పండ్లు ఉన్నాయి. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు వల్ల అనేక వ్యాధులు వస్తాయి. అయితే సమ్మర్ సీజన్‌లో ఆరోగ్యంగా ఉంచే అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. అవి తప్పనిసరిగా తీసుకోవాలి.
వేసవి కాలంలో శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. అయితే ఈ సీజన్‌లో చాలా పండ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత తలెత్తదు. తద్వారా వేసవిలో వచ్చే అనేక వ్యాధుల నుంచి బయట పడొచ్చు. ఈ సీజన్‌లో అలసట తొలగించడంలో ఈ పండ్లు మీకు సహాయపడతాయి. కాబట్టి వేసవిలో ఏ పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి.. సెలెబ్రెటీలు వేడి నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా..?
లిచీ ఫ్రూట్..
వేసవిలో వచ్చే పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి. ఇది చాలా రుచికరమైన జ్యుసి ఫ్రూట్. ఇందులో నీరు పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ సి, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు లిచీలో లభిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఈ పండు.
పుచ్చకాయ..
ఎండాకాలంలో వచ్చే వేడి గాలులను తట్టుకోవడానికి పుచ్చకాయ తినడం చాలా ముఖ్యం. నీటి శాతం ఎక్కువగా ఉండే ఈ పండులో ఫైబర్, పొటాషియం, ఐరన్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. పుచ్చకాయ తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ అవ్వదు. కడుపు చల్లగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది.
మామిడి పండు..
ఎండాకాలం వచ్చిందంటే చాలు, పండ్ల రారాజు మామిడి పండు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ పండును అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. మామిడికాయ షేక్, తీపి ,పుల్లని చట్నీ, సలాడ్లు కూడా తయారు చేస్తారు. ఫైబర్, విటమిన్ ఏ , విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, కాపర్ వంటి అనేక పోషకాలు ఈ పండులో ఉన్నాయి. ఈ సీజన్‌లో మామిడి పండు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
కర్బూజ..
ఇందులో విటమిన్ ఏ , విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటాయి. ఈ రెండు విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. పుచ్చకాయలో పొటాషియం లభిస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండును అనేక రకాల స్వీట్లలో కూడా ఉపయోగిస్తారు.
ఇది కూడా చదవండి.. మీరు తాగే నీరు స్వచ్ఛమైనదా కాదా..? ఎలా తెలుసుకోవాలి..?
బెల్ ఫ్రూట్..
వేడి నుంచి ఉపశమనం పొందడానికి బెల్ ఫ్రూట్ తినవచ్చు లేదా దాని రసం తాగవచ్చు. సమ్మర్ సీజన్‌లో ఈ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఇది కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్లుతోపాటు అన్ని రకాల పోషకాలు ఈ పండులో ఉంటాయి.
ద్రాక్ష..
ద్రాక్ష చాలా రుచికరమైన పండు. వేసవిలో దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇవి మార్కెట్‌లో అనేక రంగుల్లో లభిస్తున్నాయి. ఈ పండు అరుగుదల శక్తిని పెంపొందిస్తుంది.
నేరేడు..
నేరేడు పండ్లను "బ్లాక్‌బెర్రీస్" అనికూడా అంటారు. ఇవి తినడం వల్ల చాలాప్రయోజనాలు ఉన్నాయి. వేసవి కాలంలోనే లభించే పండు ఇది. రుచితో పాటు అనేక ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. విటమిన్ సి ,ఐరన్ ఉంటాయి. ఇది శరీరంలోని రక్తహీనతను నిర్మూలించడంలో సహాయపడుతుంది.
పైనాపిల్..
పైనాపిల్ కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా ఉండే పండు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయపడుతుంది. తద్వారా సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ పండులో ఉండే పోషకాలు ఎముకలకు కూడా చాలా మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్ ,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి.. నీటి వృథాను నిరోధించవచ్చు ఇలా..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com