అవిసె గింజలతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..? 

సాక్షి లైఫ్ : అవిసె గింజలను మ్యాజిక్ సీడ్స్ అని పిలుస్తారు. ఈ చిన్న గింజల్లో ఎన్నో ఆరోగ్యకరమైనపోషకాలు ఉంటాయి. ఇవి శాఖాహారులకు ఒక వరం లాంటివి. అవిసె గింజల్లో ఉన్నన్ని విటమిన్స్, మినరల్స్ మరెందులోనూ లేవు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు అవిసె గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే అవిసె గింజలు తినేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి ఎక్కువగా తిన్నా ప్రయోజనానికి బదులు, దుష్ప్రభావాలు తలెత్తుతాయి. అవిసె గింజలు శరీరానికి ఎలాంటప్పుడు హాని కలిగిస్తాయి..?

ఇది కూడా చదవండి..మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్లను ఎలా నియంత్రించవచ్చు..? 

వేసవికాలంలో అవిసె గింజలు తినవచ్చా..?

ఆయుర్వేదం ప్రకారం.. అవిసె గింజలు ప్రకృతిలో వేడిగా ఉంటాయి. దీని కారణంగా శరీరంలో పిత్త, కఫం మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. అందువల్ల, మీరు వేసవిలో అవిసె గింజలు తినాలనుకుంటే తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఒక ఔషధం లాగా అవిసె గింజలను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. లేకపోతే శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగి కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

 ఎప్పుడు హానికరం..?

అవిసె గింజలు ప్రతి సీజన్‌లో తినవచ్చు. అయితే అవి తినేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవిసె గింజలు ప్రేగు కదలికలను పెంచుతాయి. తద్వారా కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, వాంతులు మొదలైన సమస్యలు వస్తాయి.

లిగ్నాన్ అనే సారం అవిసె గింజలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. ఆరు నెలల కంటే ఎక్కువగా సె గింజలను తినకండి. అవిసె గింజలను ఆరు నెలలకుపైగా తీసుకోవడం వల్ల ఈ లిగ్నాన్ సారం శరీరంపై దుష్ప్రభావాలు కలిగిస్తుంది.

పచ్చి అవిసె గింజలను తినకండి. ముడి అవిసె గింజలు లేదా తక్కువ ఉడికించిన అవిసె గింజలు విషపూరితమైనవి, ఆరోగ్యానికి కూడా హానికరం. గర్భధారణ సమయంలో అవిసె గింజలను తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి..హోమియోపతి మందులతో ఒత్తిడి తగ్గుతుందా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health diabetes sugar-problem women-health-problems pregnancy-time body-heat vitamins body flax-seeds flax-seeds-side-effects side-effects-of-flax-seeds raw-flax-seeds

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com