చిన్నారుల్లో కార్డియాక్ అరెస్ట్ కారణాలు..? 

సాక్షి లైఫ్ : ఇటీవల పెద్ద చిన్న అనే తేడాల్లేకుండా గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో సైతం కార్డియాక్ అరెస్ట్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏమిటి..? ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? 

ఆహారపు అలవాట్లు:  జంక్ ఫుడ్, అధిక చక్కర, మాంసం ఎక్కువగా తినడం. వంశపారంపర్య సమస్యలు: గుండె సంబంధిత జన్యుపరమైన లోపాలు. చదువుల ఒత్తిడి: అధిక ఒత్తిడి కారణంగా కూడా గుండె సమస్యలు వస్తున్నాయి. మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్: కొన్ని మందుల వాడకం, అవలంబించకపోవడం. మయోకార్డిటిస్: గుండె పటిష్టత తగ్గడం.

 ఇది కూడా చదవండి..పీఎం నరేంద్ర మోడీ ఆరోగ్య రహస్యాలు.. 

 ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

 ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. 

 ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

చిన్నారుల్లో కార్డియాక్ అరెస్ట్ ముందు కనిపించే లక్షణాలు.. 

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
తరచూ అలసట
సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం
ఛాతీ నొప్పి
అపస్మారక స్థితి
ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్య సహాయం పొందాలి.

ఆ క్షణం ఏం చేయాలి..?

కార్డియాక్ అరెస్ట్ అనుకోకుండా వస్తుంది. అలాంటప్పుడు 

సీపీఆర్: అపస్మారక స్థితిలో ఉంటే, వెంటనే సీపీఆర్ చేయాలి.
ఎమర్జెన్సీ చికిత్స: తక్షణం కార్డియాలజిస్ట్ దగ్గరికు తీసుకెళ్లి అవసరమైన చికిత్స అందించాలి.
 కార్డియాక్ అరెస్ట్ చిన్నారుల్లో కూడా వచ్చే అవకాశాలున్నాయి.  కాబట్టి పాఠశాలల్లో, ఇళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాథమిక చికిత్స, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

 ఇది కూడా చదవండి..జీర్ణశయాంతర క్యాన్సర్స్ ఎన్నిరకాలు..?

 ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kids-health kids-health-care cardiac-arrest sudden-cardiac-arrest cardiac-arrest-in-children cardiac-arrest-in-childrens sudden-cardiac-arrest-causes sudden-cardiac-arrest-in-telugu sudden-cardiac-arrest-in-athletes
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com