Hypertension : చెవుల్లో 'రింగుమనే' శబ్దం హైపర్‌టెన్షన్‌కు హెచ్చరిక సంకేతమా..? 

సాక్షి లైఫ్ : మన శరీరంలో గుండె పంప్ చేసే రక్తం ధమనుల గోడలపై అధిక ఒత్తిడిని కలిగించినప్పుడు దాన్ని అధిక రక్తపోటు (High Blood Pressure) లేదా హైపర్‌టెన్షన్‌ అంటారు. ఇది నిశ్శబ్ద కిల్లర్ (Silent Killer) అని వైద్యులు తరచుగా హెచ్చరిస్తారు. ఎందుకంటే చాలా కాలం పాటు దీనికి ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే, శరీరం ఇచ్చే కొన్ని అసాధారణ సంకేతాలలో చెవుల్లో శబ్దాలు (Tinnitus) ఒకటి.

ఇది కూడా చదవండి..ఎలక్ట్రో-హోమియోపతిలో ఎలాంటి వ్యాధులకు చికిత్స చేయవచ్చు..?

ఇది కూడా చదవండి..Heart attack : గుండెపోటుకు ముందుగా ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

చెవుల్లో నిరంతరం 'రింగ్' మనే శబ్దం లేదా ఈల వేసినట్లు, హోరు వినిపించినట్లు అనిపించడాన్ని 'టినిటస్' అంటారు. ఇది కేవలం చెవి సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని సందర్భాల్లో ఇది అధిక రక్తపోటుకు తొలి సూచన అని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

రక్తపోటు, చెవి శబ్దాల మధ్య సంబంధం ఏంటి..?

రక్తపోటు పెరిగినప్పుడు, రక్తం ప్రసరించే వేగం, శక్తి పెరుగుతాయి. దీని ప్రభావం సూక్ష్మ రక్తనాళాలు (Micro-vessels) కలిగి ఉండే చెవి లోపలి భాగంపై పడుతుంది. రక్తపోటు పెరిగితే, చెవికి సమీపంలోని ప్రధాన రక్తనాళాల గుండా రక్తం వేగంగా పరుగెత్తుతుంది. ఈ వేగవంతమైన ప్రవాహాన్ని కొన్నిసార్లు రోగి అంతర్గతంగా శబ్దంగా వినగలుగుతారు. దీనిని పల్సాటిల్ టినిటస్ (Pulsatile Tinnitus) అంటారు.

నాళాల ఒత్తిడి..పెరిగిన ఒత్తిడి, చెవి లోపలి సున్నితమైన కణాలపై ప్రభావం చూపి, శబ్దాలను గ్రహించే విధానంలో అవాంతరాలు సృష్టించవచ్చు. ధమనులు బిగుతుగా మారడం.. హైపర్‌టెన్షన్ కారణంగా ధమనులు గట్టిపడటం లేదా బిగుతుగా మారడం వల్ల రక్త ప్రసరణలో అసాధారణ శబ్దాలు ఉత్పన్నమవుతాయి.

ఎప్పుడు అప్రమత్తం కావాలి..?

అప్పుడప్పుడు వచ్చే టినిటస్ సాధారణమే కావచ్చు. కానీ, ఈ శబ్దాలు నిరంతరంగా కొనసాగినా, తీవ్రమైన తలనొప్పి, తల తిరుగుడు (Vertigo), మెడ వెనుక భాగంలో నొప్పి, దృష్టి మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యనిపుణులను సంప్రదించాలి.

తరచుగా చెవుల్లో శబ్దాలు వినపడితే, కేవలం చెవి పరీక్షలతో సరిపెట్టకుండా, వెంటనే మీ రక్తపోటును (Blood Pressure) తప్పకుండా పరీక్షించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సకాలంలో హైపర్‌టెన్షన్‌ను గుర్తించి, చికిత్స తీసుకుంటే గుండెపోటు (Heart Attack), పక్షవాతం (Stroke) వంటి తీవ్ర సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. కాబట్టి మన శరీరం ఇచ్చే ప్రతి సంకేతాన్ని జాగ్రత్తగా గమనించి తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా హెల్తీగా ఉండొచ్చు.  

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి

Tags : low-bp high-bp hypertension bp high-blood-pressure blood-pressure high-blood-pressure-symptoms high-bp-symptoms bp-symptoms high-blood-pressure-control
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com