సాక్షి లైఫ్ : ఈ మధ్యకాలంలో పట్టుమని 20 ఏళ్లు దాటని వాళ్లు సైతం బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. బట్టతల సమస్యకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఒక శాశ్వత పరిష్కారంగా కనిపిస్తోంది. అయితే, తక్కువ ధరకో లేదా అవగాహన లేకో తప్పుడు పద్ధతులు పాటించే క్లినిక్‌లను ఆశ్రయించి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. ఇటీవల 44 ఏళ్ల వ్యక్తికి మూడుసార్లు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ విఫలమైనా, సరైన చికిత్స చేయడంతో తిరిగి జుట్టు వచ్చింది. అందుకోసం పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
అసలు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు ఎందుకు విఫలమవుతున్నాయి..? అందుకు ప్రధాన కారణాలు..?
టెక్నీషియన్ల ద్వారా చికిత్స.. అర్హత కలిగిన డాక్టర్లు కాకుండా, కేవలం టెక్నీషియన్లే సర్జరీ చేయడం వల్ల ప్రాణాంతక సమస్యలు ఎదురవుతున్నాయి.
ఓవర్ హార్వెస్టింగ్ (Over-harvesting).. తల వెనుక భాగం (Donor area) నుంచి అవసరానికి మించి వెంట్రుకలను సేకరించడం వల్ల, ఆ ప్రాంతంలో జుట్టు శాశ్వతంగా పల్చబడిపోతుంది.
అశాస్త్రీయ ప్రణాళిక.. జుట్టు లైన్ (Hairline) సహజంగా లేకుండా పోవడం, వెంట్రుకల దిశ సరిగ్గా లేకపోవడం వల్ల ఫలితాలు కూడా సరిగా రాకపోవచ్చు.
స్కారింగ్ (Scarring).. గతంలో చేసిన సర్జరీల వల్ల తలపై మచ్చలు ఏర్పడి, అక్కడ తిరిగి జుట్టు మొలిచే అవకాశం తగ్గిపోతుంది.
విఫలమైన సర్జరీ తర్వాత మళ్ళీ జుట్టు రావడం సాధ్యమేనా..?
అవును, ఆధునిక వైద్య విధానాలతో ఇది సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు.
బాడీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ (Body Hair Transplant).. తల వెనుక జుట్టు లేనప్పుడు, గడ్డం లేదా ఛాతీ భాగం నుంచి జుట్టును సేకరించి మార్పిడి చేయవచ్చు.
స్కాల్ప్ రిపేర్ సర్జరీ.. మునుపటి సర్జరీల వల్ల ఏర్పడిన మచ్చలను సరిచేస్తూ, మిగిలి ఉన్న ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా నాటడం.
ముఖ వర్చస్సుకు తగ్గట్టుగా సహజమైన హెయిర్ లైన్‌ను రీ-డిజైన్ చేయడం.
జాగ్రత్తలు ఇవే..
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది కేవలం వెంట్రుకలు నాటడం కాదు, అదొక కళ, శాస్త్రం. అనుభవం లేని వారి వద్దకు వెళ్లి ఉన్న జుట్టును పోగొట్టుకోవద్దని ప్రముఖ హెయిర్ రిస్టోరేషన్ నిపుణులు చెబ్తున్నారు.
సర్జరీకి ముందు క్లినిక్ ట్రాక్ రికార్డ్ ను గురించి తప్పనిసరిగా తెలుసుకోండి. సర్జరీ చేసేది డాక్టరా..? లేక టెక్నీషియనా..? అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. తక్కువ ఖర్చు కంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి టిప్స్ ను పరిగణలోకి తీసుకుంటే బట్టతలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com