నులిపురుగులకు నివారణ..? 

సాక్షి లైఫ్ : అసలు నులి పురుగులు ఎందుకు వస్తాయి..? పిల్లల్లో నులిపురుగులు రావడానికి ప్రధాన కారణం శుభ్రత లేకపోవడమే. దుమ్ము, ధూళి, మట్టిలో ఆడుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకోసమే పిల్లల చేతిగోర్లను శుభ్రంగా ఉంచేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. భోజనం చేసేటప్పుడు, మూత్ర, మల విసర్జన అనంతరం చేతులు శుభ్రం చేసుకోవడం పిల్లలకు నేర్పించాలి. పిల్లలు మట్టి, బురదలో ఆడుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేయించాలి. ఆదుకునే సమయంలోకూడా పలు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. 

 

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..  చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

చిన్నారుల్లో పలు అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం నులిపురుగులు. వీటిని నుంచి పిల్లలను రక్షించుకోవాలంటే ఆల్బెండజోల్ మాత్రలు వాడాలి. నులి పురుగులు పిల్లల పొట్టలోకి చేరి మెలిపెడుతూ వారి ఎదుగుదలను అడ్డుకొంటుంటాయి. దీని వల్ల రక్తహీనత, పోషకాహారలోపంతోపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నులిపురుగుల నివారణకు ఏటా రెండు సార్లు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి. 

ఆల్బెండజోల్ మాత్రలు  అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు తిరిగి వైద్య సిబ్బంది పంపిణీ చేస్తుంటారు. 1నుంచి19 ఏళ్ల వయసున్నవారికి నులిపురుగుల మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. 

1నుంచి 2 ఏళ్ల లోపు చిన్నారులకు ఆల్బెండజోల్ 400 ఎంజీ సగం మాత్ర, 3నుంచి19 ఏళ్లలోపు వారికి 400 ఎంజీ ఫుల్ టాబ్లట్ వేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

నులిపురుగుల ప్రభావం పిల్లల ఆరోగ్యంగాపై తీవ్రంగా చూపిస్తుంది. అంతేకాదు ఇవి పిల్లల శారీరక, మానసిక పెరుగుదలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. రక్తహీనత, పోషకాల లోపం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు అవుతాయి. 

ఈ సమస్యల కారణంగా పిల్లలు చదువుపై ఏకాగ్రత చూపలేరు. ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. వీటి వల్ల ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది. అందుకోసమే పిల్లలందరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

 ఏడాది వయసున్న పిల్లలతోపాటు19 ఏళ్ల వయసున్న వారికి కూడా  ఆల్బెండజోల్ టాబ్లెట్స్ తప్పనిసరిగా అందించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

 

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : kids-health kids-health-care seasonal-health-issues common-monsoon-diseases-in-kids home-remedies-for-intestinal-worms remedy-for-worms-in-kids home-remedies-for-worms-in-children natural-treatments-for-intestinal-worms best-cat-dewormer-for-all-worms natural-remedies-for-worms-in-kids intestinal-worms-treatment
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com