Chalazion : చలాజియాన్ అంటే ఏమిటి..? ఇది ఎందుకు వస్తుంది..?

షేర్ చేయండి:
Chalazion : చలాజియాన్ అంటే ఏమిటి..? ఇది ఎందుకు వస్తుంది..?

సాక్షి లైఫ్ : బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ నటి నిక్కీ తంబోలి( actress Nikki Tamboli) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కంటికి కట్టుతో ఉన్న తన ఫోటోను చూసి అభిమానులు ఆందోళన చెందగా, తనకు 'చలాజియాన్' (Chalazion) అనే సమస్య తలెత్తిందని, దాని కోసం చిన్నపాటి సర్జరీ చేయించుకున్నానని ఆమె వెల్లడించారు. అసలు ఈ చలాజియాన్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..Monitoring Dementia Patients: వేరబుల్స్ తో డెమెన్షియా బాధితుల పర్యవేక్షణ సులభం..

ఇది కూడా చదవండి..Auto-Brewery Syndrome : ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అంటే ఏమిటి..?

 

చలాజియాన్ అంటే ఏమిటి..?

మన కనురెప్పల అంచున కంటిని తేమగా ఉంచడానికి 'మీబోమియన్' (Meibomian) అనే నూనె గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల్లో ఏదైనా అడ్డుపడి (Blockage), నూనె బయటకు రాకుండా లోపలే పేరుకుపోయినప్పుడు అక్కడ ఒక చిన్న గడ్డలా తయారవుతుంది. దీనినే 'చలాజియాన్' లేదా 'ఐలెడ్ సిస్ట్' అని పిలుస్తారు. సాధారణంగా ఇది పై కనురెప్పపై కనిపిస్తుంది, అరుదుగా కింద కూడా రావచ్చు.

కురుపు(Stye) కి, చలాజియాన్ కి తేడా ఏంటి..?

చాలామంది చలాజియాన్‌ను సాధారణ కురుపు లేదా 'స్టై' అని పొరబడుతుంటారు. కానీ ఇవి రెండు వేర్వేరు.. కురుపు (Stye) ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కనురెప్ప అంచున ఎర్రగా ఉండి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. చలాజియాన్ అనేది నొప్పి లేకుండా ఉండే గడ్డ. ఇది కనురెప్ప అంచున కాకుండా కొంచెం వెనక భాగంలో ఏర్పడుతుంది. ప్రారంభంలో నొప్పి ఉన్నా, క్రమంగా నొప్పి తగ్గి కేవలం గడ్డలా మిగిలిపోతుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి..?

కనురెప్పపై నొప్పి లేని చిన్న గడ్డలా కనిపించడం. కంటిలో ఏదో ఉన్నట్లుగా అసౌకర్యంగా అనిపించడం. గడ్డ పరిమాణం పెరిగితే కనుపాపపై ఒత్తిడి పడి చూపు మసకబారడం. కంటి నుంచి నీరు కారడం, దురదగా ఉండటం. ఒక్కోసారి కనురెప్ప మొత్తం వాపు రావడం.

ఎవరికి ముప్పు ఎక్కువ..?

గతంలో చలాజియాన్ వచ్చిన వారికి మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది.

కనురెప్పల వాపు (Blepharitis) సమస్య ఉన్నవారికి.

చర్మ వ్యాధులు అంటే రోసేసియా, డాండ్రఫ్ వంటివి ఉన్నవారికి.

కంటి శుభ్రత పాటించని వారికి, మేకప్ సరిగ్గా క్లీన్ చేసుకోని వారికి.

చికిత్స - జాగ్రత్తలు.. 

చాలావరకు ఇవి ఇంట్లోనే తగ్గుతాయి. అయితే పొరపాటున కూడా ఆ గడ్డను నొక్కడం లేదా గిల్లడం వంటివి చేయకూడదు. ఒక శుభ్రమైన వస్త్రాన్ని గోరువెచ్చని నీటిలో ముంచి, రోజుకు 3-4 సార్లు 15 నిమిషాల పాటు కంటిపై ఉంచాలి. దీనివల్ల గ్రంథిలోని అడ్డు తొలగి నూనె బయటకు వస్తుంది. కంటికి ఎటువంటి మేకప్ వేసుకోకూడదు. చేతులతో కంటిని ముట్టుకోకూడదు.

 ఒక నెల దాటినా గడ్డ తగ్గకపోతే లేదా చూపుపై ప్రభావం పడితే వెంటనే నేత్ర వైద్యుడిని సంప్రదించాలి. నిక్కీ తంబోలి విషయంలో గడ్డ తగ్గకపోవడంతో చిన్న సర్జరీ ద్వారా ఆ ద్రవాన్ని తొలగించాల్సి వచ్చింది. కంటి సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు స్వయం వైద్యం కంటే నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది.

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..Latest Research: తాజా పరిశోధన : స్మార్ట్‌ఫోన్.. పురుషుల్లో సంతానలేమికి కారణమవుతుందా..?

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.