What Is Asphyxia : అస్ఫిక్సియాతో నోయిడా టెక్కీ మృతి.. అస్ఫిక్సియా అంటే ఏమిటి..?    

సాక్షి లైఫ్ : గ్రేటర్ నోయిడాలో 27 ఏళ్ల యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కారుతో సహా నిర్మాణంలో ఉన్న నీటి గుంతలో పడిపోయిన యువరాజ్.. సుమారు 90 నిమిషాల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఆయన మరణానికి కారణం ‘అస్ఫిక్సియా’ (Asphyxia) అని తేలింది. అసలు ఈ అస్ఫిక్సియా అంటే ఏమిటి? ఇది మనిషి ప్రాణాలను ఎలా హరిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

 

అస్ఫిక్సియా అంటే ఏమిటి..? (What is Asphyxia)

శరీరంలోని కణజాలాలకు, ముఖ్యంగా మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ (oxygen) నిలిచిపోయినప్పుడు ఏర్పడే పరిస్థితినే ‘అస్ఫిక్సియా’ అంటారు. గాలి పీల్చుకోవడంలో ఆటంకం ఏర్పడటం వల్ల రక్తంలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయి, ప్రాణవాయువు పడిపోతుంది.

యువరాజ్ మెహతా కేసులో.. ఆయన కారు నీటిలో మునిగిపోయినప్పుడు, ఊపిరితిత్తుల్లోకి నీరు, బురద చేరాయి. దీనివల్ల ఆయన శ్వాస వ్యవస్థ పూర్తిగా ఆగిపోయి, ‘అస్ఫిక్సియా’ వల్ల మరణించారని వైద్యులు నిర్ధారించారు.

అస్ఫిక్సియా వల్ల గుండె ఎలా ఆగిపోతుంది అంటే..?

గాలి అందకపోవడం వల్ల శరీరంలో ఒక ప్రమాదకరమైన గొలుసుకట్టు చర్య మొదలవుతుంది. ముఖ్యంగా శ్వాస అందకపోవడంతో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. అవయవాల వైఫల్యానికి ప్రధాన కారణం ఆక్సిజన్ అందకపోవడం. మెదడు, గుండెకు ఆక్సిజన్ అందకపోవడంతో అవి సరిగ్గా పనిచేయలేవు.

గుండె వైఫల్యం (Cardiac Arrest).. 

 ఆక్సిజన్ లేని స్థితిలో గుండె కండరాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. దీంతో గుండె కొట్టుకోవడం ఆగిపోయి ‘కార్డియాక్ అరెస్ట్’ సంభవిస్తుంది.

అస్ఫిక్సియాకు దారితీసే ఇతర కారణాలు.. 

కేవలం నీటిలో మునిగిపోయినప్పుడే కాకుండా, ఇతర పరిస్థితుల్లోనూ అస్ఫిక్సియా సంభవించవచ్చు. ఆహారం లేదా ఏదైనా వస్తువు గొంతులో అడ్డుపడటం (Choking). బాహ్య ఒత్తిడి వల్ల గాలి గొట్టం మూసుకుపోవడం. కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులను పీల్చడం వల్ల ఆక్సిజన్ ప్రసరణ ఆగిపోవడం. ఊపిరితిత్తుల వ్యాధుల కారణంగా శ్వాస తీసుకోలేకపోవడం జరుగుతుంది. 

ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి..?

ఎవరైనా అస్ఫిక్సియాకు లోనవుతున్నారని గమనిస్తే, సెకన్ల కాలం కూడా ఎంతో విలువైనది. బాధితుడిని వెంటనే ప్రమాద స్థలం నుంచి బయటకు తీసుకు వచ్చి, గాలి తగిలేలా ఉంచాలి. ఒకవేళ శ్వాస ఆగిపోయినట్లు అనిపిస్తే, వెంటనే సి.పి.ఆర్ ప్రక్రియను ప్రారంభించాలి. ఇది గుండె, మెదడుకు రక్త ప్రసరణను కొనసాగించడంలో సహాయపడుతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సేవల కోసం108కు కాల్ చేయాలి.

 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : tensions air-pollution brain-health heart-risk heart-failure brain-stroke oxygen respiration heart-conditions cpr
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com