Monitoring Dementia Patients: వేరబుల్స్ తో డెమెన్షియా బాధితుల పర్యవేక్షణ సులభం..

సాక్షి లైఫ్ : వయసు పైబడిన వారిని వేధించే ప్రధాన సమస్యల్లో 'డెమెన్షియా' (Dementia) ఒకటి. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడమే కాకుండా, వారి నిద్ర అలవాట్లు మారిపోతాయి. అర్ధరాత్రి పూట ఆందోళనగా అటు ఇటు తిరగడం, పగలు నిద్రపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే, కేవలం చేతికి ధరించే ఒక చిన్న పరికరం (Wearable) ద్వారా ఇలాంటి వారిని మెరుగ్గా పర్యవేక్షించవచ్చని, వారి ఆరోగ్య స్థితిని ముందుగానే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది.

 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

రీల్ టైమ్ లొకేషన్ సిస్టమ్ (RTLS) తో నిఘా..

సాధారణంగా నర్సింగ్ హోమ్‌లలో రోగులు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవడానికి 'లొకేషన్ ట్రాకర్స్' ఉపయోగిస్తుంటారు. కానీ శాస్త్రవేత్తలు వీటిని కేవలం ట్రాకింగ్‌కే కాకుండా, వారి నిద్ర-కదలికల సరళిని (Rest-Activity Rhythms) విశ్లేషించడానికి ఉపయోగించారు. సుమారు 16 వారాల పాటు 80 ఏళ్ల పైబడిన 47 మంది వృద్ధుల కదలికలను ప్రతి 15 నిమిషాలకు ఒకసారి రికార్డు చేశారు.

ఆరు రకాల శైలులు.. వాటి లక్షణాలు.. !

ఈ పరిశోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రోగుల కదలికలను ఆరు రకాలుగా విభజించారు. కొందరిలో నిద్ర సమయాలు అస్తవ్యస్తంగా ఉండటం. రాత్రి వేళల్లో పడకపై ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉండటం. మరికొందరిలో నిద్ర, కదలికలు సక్రమంగా ఉండటం. రాత్రిపూట కదలికలు ఎక్కువగా ఉన్నవారిలో మానసిక ఆందోళన, చిరాకు (Agitation) ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ప్రయోజనాలేమిటి అంటే..?

 రోగి నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నా లేదా రాత్రివేళల్లో ఎక్కువ ఆందోళన చెందుతున్నా ఈ డిజిటల్ డేటా ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు. ప్రతి రోగి సమస్య భిన్నంగా ఉంటుంది. వారి కదలికల శైలిని బట్టి వారికి తగినట్లుగా చికిత్స, పర్యవేక్షణ అందించవచ్చు.


వైద్యులు కేవలం రోగుల మాటల మీద కాకుండా, ఈ ఖచ్చితమైన డేటా ఆధారంగా మందులు లేదా చికిత్స మార్పులు చేయవచ్చు. టెక్నాలజీ సాయంతో వృద్ధాప్య సమస్యలను ముందే గుర్తించి, వారికి నాణ్యమైన జీవితాన్ని అందించడానికి ఈ పరిశోధన ఒక కొత్త దారిని చూపింది. భవిష్యత్తులో ఈ 'వేరబుల్స్' డెమెన్షియా కేర్ సెంటర్లలో కీలక పాత్ర పోషించనున్నాయి.

 

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : dementia cognitive-decline-and-dementia smart-health-devices prevent-dementia ai-device dementia-risk-reduction preventing-dementia-with-exercise dementia-prevention-tips
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com