Doomscrolling : మీరు 'డూమ్‌స్క్రోలింగ్' వలయంలో చిక్కుకున్నారా..? స్మార్ట్ ఫోన్‌కు బానిసలేనట్లే..!

షేర్ చేయండి:
Doomscrolling : మీరు 'డూమ్‌స్క్రోలింగ్' వలయంలో చిక్కుకున్నారా..? స్మార్ట్ ఫోన్‌కు బానిసలేనట్లే..!

సాక్షి లైఫ్ : స్మార్ట్‌ఫోన్‌ చేతిలోకి వచ్చిందంటే చాలు.. గంటల తరబడి వార్తలు, వీడియోలు చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా విషాదకరమైన వార్తలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా ప్రపంచంలో జరుగుతున్న ఆందోళనకరమైన పరిణామాలను చదువుతూ ఫోన్‌ స్క్రీన్‌ను కిందికి స్క్రోల్ చేస్తూ (Scrolling) సమయాన్ని మర్చిపోతుంటాం. దీనినే సైకాలజీ పరిభాషలో 'డూమ్‌స్క్రోలింగ్' (Doomscrolling) అంటారు. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు, మెదడులోని రసాయన ప్రక్రియల వల్లే దీనిని ఆపడం అసాధ్యంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

 ఆపలేమా..మరి..?

మనం ఏదైనా ఆసక్తికరమైన సమాచారం కోసం చూస్తున్నప్పుడు మెదడులో 'డోపమైన్' అనే రసాయనం విడుదలవుతుంది. చెడు వార్త విన్నప్పుడు మన మెదడు సహజంగానే 'ముప్పు' గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతుంది. ఇలా తెలుసుకోవడం వల్ల ఏదో ఒక నియంత్రణ సాధించామనే భ్రమ కలుగుతుంది. ఫలితంగా, ఎంత చూసినా తృప్తి కలగక ఫోన్‌ను వదలలేకపోతున్నాం.

డూమ్‌స్క్రోలింగ్ ప్రభావం.. 

 నిరంతరం ప్రతికూల వార్తలు చూడటం వల్ల తెలియకుండానే భయం, ఒత్తిడి పెరుగుతాయి. రాత్రిపూట చీకటిలో స్క్రీన్ చూడటం వల్ల 'మెలటోనిన్' ఉత్పత్తి తగ్గి నిద్ర దెబ్బతింటుంది. చిన్న చిన్న పనులపై కూడా దృష్టి పెట్టలేకపోవడం. ఏకాగ్రత లోపం వల్ల జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

బయటపడటం ఎలా..?

సమయాన్ని కేటాయించండి.. వార్తల కోసం రోజులో కేవలం 15-20 నిమిషాలు మాత్రమే కేటాయించండి. అలారం సెట్ చేయండి.. సోషల్ మీడియా వాడేటప్పుడు ఒక పరిమితి పెట్టుకోండి. పడుకోవడానికి గంట ముందే ఫోన్‌ను దూరంగా ఉంచండి. ఫోన్ చూసే బదులు పుస్తకం చదవడం లేదా కాసేపు నడవడం వంటివి అలవాటు చేసుకోండి. మన మానసిక ప్రశాంతత మన చేతుల్లోనే ఉంటుంది. ఫోన్ స్క్రోలింగ్ మీ నియంత్రణ తప్పుతోందని అనిపిస్తే వెంటనే జాగ్రత్త పడటం అవసరం.

 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.