Beat the Winter Blues : వింటర్ బ్లూస్ కు చెక్ పెట్టండి.. మానసిక ఉల్లాసాన్ని పెంచుకోండిలా..!

సాక్షి లైఫ్ : చలికాలం (Winter) వచ్చిందంటే చాలు... కొందరిలో ఉత్సాహం తగ్గి, విచారం (Sadness), నిస్సత్తువ (Lethargy) ఆవహిస్తాయి. దీనినే 'సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్' (SAD) లేదా 'వింటర్ బ్లూస్' (Winter Blues) అంటారు. సూర్యరశ్మి తక్కువగా ఉండటం, చల్లని వాతావరణం, ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం దీనికి ప్రధాన కారణాలు. అయితే, ఈ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ ను సులభంగా దూరం చేసుకోవడానికి మూడు ప్రభావవంతమైన మార్గాలు (Easy Ways) ఉన్నాయి. అవేంటంటే..?

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి..(Soak Up Sunlight)..


చలికాలంలో ఎంత చలిగా ఉన్నా...రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం చాలా ముఖ్యం.
సహజమైన సూర్యకాంతి (Natural Light) శరీరంలోని సెరోటోనిన్ (Serotonin) అనే 'సంతోషకరమైన హార్మోన్' స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఇది మీ మనస్థితిని (Mood) మెరుగుపరుస్తుంది.

 ఉదయం పూట కాసేపు కిటికీ పక్కన కూర్చోవడం, లేదంటే నడక (Brisk Walk) లేదా కాసేపు పార్కులో గడపడం వంటివి చేయాలి. ఈ చిన్న ప్రయత్నం మీ శక్తి స్థాయిలను (Energy Levels) పెంచుతుంది.

 వ్యాయామం, యోగాకు ప్రాధాన్యత ఇవ్వాలి..(Prioritize Exercise & Yoga).. 

చలికి ఇంట్లోనే ఉంటే బద్ధకం మరింత పెరుగుతుంది. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, యోగా వింటర్ బ్లూస్ ను ఓడించడానికి వీలుకలుగుతుంది.

వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో ఎండార్ఫిన్లు (Endorphins) విడుదలవుతాయి. ఇవి సహజసిద్ధమైన నొప్పి నివారిణులుగా, మూడ్ బూస్టర్‌లుగా (Mood Boosters) పనిచేస్తాయి. రోజుకు కనీసం 30 నిమిషాలు వేగంగా నడవడం, ఇంట్లోనే ఏరోబిక్స్ చేయడం లేదా కొన్ని యోగా ఆసనాలు వేయడం చేయాలి. ఉదాహరణకు: కపాలభాతి, సూర్య నమస్కారాలు మీ శరీరాన్ని, మనసును ఉత్తేజపరుస్తాయి.

 సమతుల్య ఆహారం, విటమిన్ 'డి' (Balanced Diet and Vitamin D).. 


చలికాలంలో వేడివేడి, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ, సరైన పోషకాహారం మీ మెదడు ఆరోగ్యానికి చాలా కీలకం. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega-3 Fatty Acids) విటమిన్ D లోపం (Vitamin D Deficiency) కూడా నిరాశకు దారితీయవచ్చు. సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి తక్కువగా లభిస్తుంది.

 పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు (Whole Grains) ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. సాల్మన్, వాల్‌నట్స్ వంటి ఒమేగా-3 రిచ్ ఫుడ్స్‌ను చేర్చండి. విటమిన్ డి సప్లిమెంట్స్ (Supplements) తీసుకునేముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఈ చిట్కాలు 'వింటర్ బ్లూస్' నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి.  

 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health mental-tensions kids-health seasonal-health-issues winter-season dry-skin-tips-for-winter-season wellness-tips mental-wellness winter-blues seasonal-depression sad mood-boost winter-wellness
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com