సంగీతం మానసిక ఆందోళనలను నియంత్రించగలదా..?

సాక్షి లైఫ్ : సంగీతం అంటే మీ చెవిలో పడగానే రిలాక్సేషన్ అనుభూతిని ఇచ్చే అందమైన ట్యూన్. ఇది రాగాల కలయికతో రూపొందించిన నైపుణ్యం. ఇది మన మనస్సుపై ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే మనసుకు ఓదార్పు నిచ్చే సంగీతం వెనుక ఉన్న కొన్ని శాస్త్రీయ అంశాలను గురించి తెలుసుకుందాం.. 

సంగీతం వినడం ఎవరికైనా ఇష్టమే.. మధురమైన రాగం మన మనస్సును ప్రశాంతపరుస్తుంది. మనల్ని రిలాక్స్‌గా చేస్తుంది. కొందరు డ్రైవింగ్ చేసేటప్పుడు సంగీతం వినడానికి ఇష్టపడతారు. మరి కొంతమంది ఏదైనా పని చేస్తున్నప్పుడు సంగీతం వినడానికి ఇష్టపడతారు. కొందరికి ఫాస్ట్ బీట్‌ సాంగ్స్ నచ్చితే మరికొందరు స్లో అండ్ క్వైట్ మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తుంటారు.


ఇది కూడా చదవండి..యోగా ఏ సమయంలో చేస్తే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..రక్తమార్పిడి వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

 

 

మెదడులో సహజమైన రివార్డ్ సర్క్యూట్‌లు ఉన్నాయని ఒక పరిశోధన కనుగొంది. ఇవి సంగీతం, ఆహారం, డబ్బు వంటి రివార్డ్‌లపై పనిచేయడం ద్వారా సానుకూల ఫలితాలను ఇస్తాయి. మెదడు శ్రవణ ప్రాంతం, అంటే వినే సామర్థ్యాన్ని నియంత్రించే భాగం, మెదడు రివార్డ్ సర్క్యూట్‌కు సంబంధించినదిగా గుర్తించారు. సంతోషకరమైన లేదా విచారకరమైన పాటలను వింటున్నప్పుడు మెదడు ఒక్కోసారి ఒక్కో రకమైన ముఖ కవళికలను సృష్టిస్తుంది. అప్పుడు అలాగే అనుభూతి చెందుతుంటామని పరిశోధకులు చెబుతున్నారు.


మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఏదైనా సంగీత వాయిద్యం నేర్చుకునే పిల్లలకు వారి నైపుణ్యాలు ఇతర పిల్లల కంటే మెరుగ్గా ఉంటాయని ఓ పరిశోధనలో తేలింది. సంగీతం అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పనిలో ఉన్నప్పుడు మ్యూజిక్ వింటూ డ్రైవింగ్ చేయడం లేదా వ్యాయామం చేస్తే అలసిపోకుండా ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం, లేదా వ్యాయామం చేయగలుగుతారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

సంగీతం మన మెదడును ఆకర్షిస్తుంది. దీని కారణంగా అలసట సంకేతాలపై ఆనందానికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తాయి. అందుకే, సంగీతం వింటున్నప్పుడు, ఎక్కువసేపు అలసిపోయే పని చేసినా అలసిపోయినట్లు తెలియదని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. నిశ్శబ్దంగా సైకిల్ తొక్కే సైక్లిస్టులతో పోలిస్తే సంగీతం వినే సైక్లిస్టులకు 7శాతం తక్కువ ఆక్సిజన్ అవసరమని 2012లో నిర్వహించిన పరిశోధనలో తేలింది.

మ్యూజిక్ -సైన్స్.. 

శాస్త్రీయ పరంగా కూడా మ్యూజిక్ కు, సైన్స్ కు ఖచ్చితంగా కనెక్షన్ ఉందని నిరూపితమైంది. కాబట్టి సంగీతం వినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని సపరిశోధకులు చెబుతున్నారు. సంగీతం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

 ప్రయోజనాలు..?

-మానసికంగా తీవ్రంగా గాయపడినప్పటికీ, సంగీతానికి పాత జ్ఞాపకాలను తిరిగి తెచ్చే శక్తి ఉంటుంది.

-మ్యూజిక్ మానసిక ఆందోళనలను నియంత్రిస్తుంది.

-ప్రతిరోజూ సంగీతం వినే అలవాటు మీ పని సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు.

-ప్రస్తుతం పాటలను పాడటం ద్వారా రికార్డ్ చేయగల అనేక రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి మరింతగా ఆనందాన్ని ఇస్తాయి.  

-మ్యూజిక్ ఒత్తిడి, డిప్రెషన్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
- ఒంటరితనంలో ఉన్నప్పుడు కొన్ని పాటలు ఓదార్పును అందిస్తాయి. 

-సంగీతం గుండె స్పందన రేటును సర్దుబాటు చేస్తుంది.

-మ్యూజిక్ తో దృష్టి కేంద్రీకరించగలరు. తద్వారా పనిని సరిగ్గా చేయగలుగుతారు.

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?

ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..? 

ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : mental-health depression mental-tensions stress anxiety-effect stress-mind anxiety mental-stress music music-lovers music-benefits health-benefits-of-music stress-management stress-triggers how-to-treat-depression-and-anxiety

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com