Cuddle Therapy for Mental Relief : మెంటల్ రిలీఫ్ కోసం కడ్ల్ థెరపీ.. స్ట్రెస్ తగ్గించేందుకు సరికొత్త విధానం..
సాక్షి లైఫ్ : ఆధునిక సాంకేతికత పెరిగి లోకం అరచేతిలోకి వచ్చేసింది.. కానీ మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది! ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైన అమెరికాను ఇప్పుడు ఒక 'నిశ్శబ్ద మహమ్మారి' వణికిస్తోంది. అదే.. ఒంటరితనం. మనసు విప్పి మాట్లాడే తోడు దొరక్క, మానసిక వేదనను పంచుకోలేక అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఒంటరితనం నుంచి బయటపడేందుకు అమెరికన్లు ఇప్పుడు సరికొత్త, వినూత్న పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. మనసు తేలికపడాలా..? అయితే 'క్రై ఎన్ వైబ్' క్లబ్‌కు రండి..! చాలామంది తమ మనసులోని బాధను, అసంతృప్తిని బయటకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతుంటారు. ఇతరుల ముందు ఏడిస్తే ఎక్కడ తక్కువ చేసి చూస్తారో అన్న భయం వారిని మరింత వేధిస్తుంది. ఇలాంటి వారి కోసం అమెరికాలో 'క్రై ఎన్ వైబ్' (Cry N Vibe) వంటి క్రైయింగ్ క్లబ్‌లు వెలిశాయి. ఇక్కడ ఒంటరితనంతో బాధపడేవారంతా ఒక సమూహంగా ఏర్పడతారు.
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
