Heart Disease Risk : డిప్రెషన్, దృష్టి లోపం.. ఈ రెండూ గుండెకు ముప్పే.. తాజా అధ్యయనం

షేర్ చేయండి:
Heart Disease Risk : డిప్రెషన్, దృష్టి లోపం.. ఈ రెండూ గుండెకు ముప్పే.. తాజా అధ్యయనం

సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలిలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థితి, ఇంద్రియాల పనితీరు కూడా గుండె ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మానసిక కుంగుబాటు (Depression) కంటి చూపు మందగించడం అనేవి విడివిడిగానే కాకుండా, కలిస్తే గుండె జబ్బుల ముప్పును ప్రమాదకర స్థాయికి తీసుకెళ్తాయని తాజా అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

 

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

చైనాలోని మిడిల్ ఏజ్డ్ , వృద్ధులపై నిర్వహించిన ఒక భారీ స్థాయి పరిశోధన ప్రకారం.. డిప్రెషన్ ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం దాదాపు 60 శాతం ఎక్కువగా ఉంది. అలాగే, దృష్టి లోపంతో బాధపడుతున్న వారిలో ఈ ముప్పు 25 శాతం అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ముప్పు పెరగడానికి కారణాలివే..

ఈ రెండూ నేరుగా, పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.కంటి చూపు సరిగా లేని వారు లేదా మానసిక కుంగుబాటులో ఉన్నవారు వ్యాయామం చేయడానికి, బయట తిరగడానికి ఇష్టపడరు. ఇది ఊబకాయం, రక్తపోటుకు దారితీసి గుండెపై ఒత్తిడి పెంచుతుంది. డిప్రెషన్ వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు (Stress Hormones) పెరిగి, గుండె కండరాలకు రక్తప్రసరణను అడ్డుకోవచ్చు. కుంగుబాటులో ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించలేక, క్రమం తప్పకుండా వాడాల్సిన మందులను నిర్లక్ష్యం చేస్తారు. ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.


రెగ్యులర్ స్క్రీనింగ్..

 45 ఏళ్లు పైబడిన వారు కేవలం బీపీ, షుగర్ మాత్రమే కాకుండా, కంటి చూపు, మానసిక స్థితిని కూడా ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే కేవలం ఆహార నియమాలు పాటిస్తే సరిపోదు; మానసిక ప్రశాంతత, మెరుగైన దృష్టి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంటరితనం డిప్రెషన్‌ను పెంచుతుంది కాబట్టి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం ఉత్తమం. మొత్తానికి, 'కంటిని.. మనసుని' క్షేమంగా ఉంచుకుంటేనే 'గుండె' పదికాలాల పాటు పదిలంగా ఉంటుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.