Gut-Brain Axis: మైండ్ కి, జీర్ణక్రియకు ఉన్న లంకె ఏంటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కొన్ని సందర్భాల్లో మనం కంగారు పడినప్పుడు కడుపులో ఏదో తిప్పినట్లు అనిపించడం, ఆందోళనగా ఉన్నప్పుడు ఆకలి వేయకపోవడం వంటివి అందరం గమనించే ఉంటాం. దీనికి కారణం మన మెదడుకు, జీర్ణవ్యవస్థకు మధ్య ఉన్న విడదీయలేని సంబంధమే. దీనినే శాస్త్రవేత్తలు 'గట్-బ్రెయిన్ యాక్సిస్' (Gut-Brain Axis) అని పిలుస్తారు.

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

 

ఏమిటీ రెండో మెదడు..?

మన జీర్ణనాళంలో కోట్లాది నాడులు ఉంటాయి. దీనిని 'ఎంటెరిక్ నెర్వస్ సిస్టమ్' (ENS) అంటారు. ఇది మన తలలో ఉండే మెదడుతో సంబంధం లేకుండానే స్వతంత్రంగా పనిచేయగలదు. ఆహారాన్ని జీర్ణం చేయడం, పోషకాలను గ్రహించడంతో పాటు.. మెదడుకు సంకేతాలను పంపడం దీని ప్రత్యేకత.

మూడ్‌ని మార్చే 'గట్' మ్యాజిక్.. 

హ్యాపీ హార్మోన్లు.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన శరీరంలో ఉత్సాహాన్ని ఇచ్చే 'సెరోటోనిన్' అనే హార్మోన్ సుమారు 90-95 శాతం మన జీర్ణవ్యవస్థలోనే ఉత్పత్తి అవుతుంది. అందుకే గట్ ఆరోగ్యంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

బ్యాక్టీరియా ప్రభావం.. మన జీర్ణకోశంలో ఉండే మంచి బ్యాక్టీరియా (Microbiome) మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వీటిలో అసమతుల్యత ఏర్పడితే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి.

జీర్ణక్రియ, మానసిక ఆరోగ్యం.. 

ప్రోబయోటిక్స్ తీసుకోండి. పెరుగు, మజ్జిగ వంటి పదార్థాల్లో ఉండే మంచి బ్యాక్టీరియా పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది.పీచు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగి, మెదడు చురుగ్గా ఉంటుంది.మితిమీరిన ఆందోళన వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మందగించి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. మెడిటేషన్ చేయడం వల్ల పొట్ట కూడా ప్రశాంతంగా ఉంటుంది.

తగినంత నీరు తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోయి జీర్ణనాళం శుభ్రంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను జాగ్రత్తగా చూసుకుంటే అది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.