Eating Disorders : ఈటింగ్ డిజార్డర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
సాక్షి లైఫ్ : ఆహారం మన ప్రాణాధారం. కానీ, కొందరి విషయంలో అదే ఆహారం ఒక పీడకలగా మారుతుంది. తినే పద్ధతిలో, ఆహారం పట్ల చూపే ధోరణిలో వచ్చే మార్పులే 'ఈటింగ్ డిజార్డర్స్'. ఇవి కేవలం శారీరక సమస్యలు మాత్రమే కాదు, లోతైన మానసిక సంఘర్షణకు సంకేతాలు. ప్రధానంగా కనిపించే ఈటింగ్ డిజార్డర్స్ రకాలేమిటి..? అవి ఎలా ఉంటాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
1. అనొరెక్సియా నైర్వోసా (Anorexia Nervosa)..
ఈ సమస్యతో బాధపడేవారు తాము లావవుతున్నామనే భయంతో ఆహారం తీసుకోవడమే మానేస్తారు. శరీర బరువు విపరీతంగా తగ్గినా, ఇంకా తాము లావుగానే ఉన్నామని భావించడం. చాలా తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం. ఇది ప్రాణాంతకమైన స్థితికి దారితీసే అవకాశం ఉంది.
2. బులీమియా నైర్వోసా (Bulimia Nervosa)..
ఈ రుగ్మత విషయంలో వ్యక్తులు నియంత్రణ లేకుండా ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. ఆ తర్వాత లావవుతామనే ఆందోళనతో తిన్న ఆహారాన్ని బయటకు పంపే ప్రయత్నం చేస్తారు. అతిగా తినడం (Binge eating), ఆ వెంటనే వాంతులు చేసుకోవడం, విపరీతంగా వ్యాయామం చేయడం వంటివి చేస్తారు ఈ సమస్య ఉన్నవాళ్లు. దీనివల్ల గొంతు సమస్యలు, పంటి ఎనామిల్ దెబ్బతినడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి.
3. బింజ్ ఈటింగ్ డిజార్డర్ (Binge Eating Disorder)..
చాలామందిలో కనిపించే సాధారణ సమస్య ఇది. ఆకలి లేకపోయినా, కడుపు నిండినా నియంత్రణ లేకుండా తింటూనే ఉంటారు. అతి తక్కువ సమయంలోనే భారీ మొత్తంలో ఆహారం లాగించడం. తిన్న తర్వాత గిల్టీగా (అపరాధ భావం) ఫీల్ అవ్వడం.. వంటి లక్షణాలు ఉంటాయి. దీనివల్ల ఊబకాయం (Obesity), మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
4. పికా (Pica)..
పోషకాలు లేని ఆహారం, పదార్థాలను తినాలనిపించడాన్ని 'పికా' అంటారు. ముఖ్యంగా మట్టి, సుద్దముక్కలు, పేపర్, జుట్టు లేదా సబ్బు వంటి వింత పదార్థాలను తినడం దీని లక్షణాలు. ఇది ఎక్కువగా చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలలో కనిపిస్తుంది.
5. రుమినేషన్ డిజార్డర్..
మింగిన ఆహారం అరగక ముందే మళ్లీ నోట్లోకి రావడం ఈ రుగ్మత ప్రధాన లక్షణం. మింగిన ఆహారం తిరిగి నోట్లోకి రాగానే దాన్ని మళ్లీ నమలడం లేదా బయటకు ఉమ్మేయడం. ఇది ఉద్దేశపూర్వకంగా జరగకపోయినా, ఒక అలవాటుగా మారుతుంది.
6. నివారించే, నియంత్రణాత్మక ఆహారం తీసుకోనే రుగ్మత Avoidant/restrictive food intake disorder (ARFID).. బరువు పెరగాలనే ఆలోచన లేకపోయినా, కొన్ని రకాల ఆహారాలను ముట్టడానికి కూడా ఇష్టపడకపోవడం. లేనిపోని కారణాల వల్ల తినే ఆహారం పరిమితం చేయడం. ఆహార ఎంపికలో పరిమితులు.. ఆహారం రంగు, రుచి లేదా వాసన నచ్చకపోవడం వల్ల లేదా మింగితే ఎక్కడ గొంతులో అడ్డుపడుతుందో అనే భయంతో అతి తక్కువ రకాల ఆహారాలను మాత్రమే తీసుకోవడం.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒకే వ్యక్తిలో ఒకటి కంటే ఎక్కువ రకాల ఈటింగ్ డిజార్డర్స్ ఉండవచ్చు. అందుకే ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా మానసిక,శారీరక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
