శీతాకాలంలో డిప్రెషన్ ను ఎలా నివారించాలి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శీతాకాలంలో డిప్రెషన్ ను నివారించడానికి, దాని కారణాలను మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు ఒక కోటి మంది ప్రజలు శీతాకాలపు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సహజంగా ఈ సీజన్ లో ప్రజలు చలికి పని చేయడానికి ఇష్టపడరు. దీని కారణంగా బద్ధకం పెరిగిపోతుంది..  

ప్రపంచవ్యాప్తంగా చలి కారణంగా సోమరితనం పెరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. కానీ మారుతున్న వాతావరణంతో మానసిక స్థితి కూడా ప్రభావితమవుతుంది. కొంతమందిలో ఇది డిప్రెషన్ రూపంలో కూడా ఉంటుంది. వింటర్ సీజన్ లో డిప్రెషన్ నుంచి ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శీతాకాలంలో ప్రతి ఉదయం.. 

ఉదయం నిద్రలేచి సూర్యరశ్మిలోకి వెళ్లగానే మెదడు నుంచి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ విడుదలవుతుందని, ఇది చురుకుగా ఉండటానికి సిద్ధం చేస్తుందని" ప్రొఫెసర్ ఆండ్రూ వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

కార్టిసాల్‌.. 

మన శరీరం రోజుకు ఒకసారి కార్టిసాల్‌ను విడుదల చేస్తుంది. ఇది శరీర సాధారణ ప్రక్రియ. అయితే ఈ కార్టిసాల్‌ను ఉదయం కాకుండా సాయంత్రం విడుదల చేస్తే..? ఈ విషయంలో, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డేవిడ్ స్పీగెల్ అండ్ బాబ్ సపోల్స్కీ ఒక పరిశోధన చేసి, ఈ ఆరోగ్యకరమైన కార్టిసాల్ ఉదయం కాకుండా రాత్రి 8-9 గంటల మధ్య విడుదల అయితే, అది డిప్రెషన్‌కు దారితీస్తుందని గమనించాలని, పరిశోధకులు చెబుతున్నారు. 

 కాబట్టి ఉదయాన్నే సూర్యరశ్మి తగలడం ద్వారా, ఆరోగ్యకరమైన కార్టిసాల్ స్థాయిలను సాయంత్రం కాకుండా ఉదయానికి మార్చడం ద్వారా డిప్రెషన్ వంటి వ్యాధులను నివారించవచ్చని అధ్యయనాలు తేల్చాయి. 

ఉదయాన్నే శరీరానికి సూర్యరశ్మి తగలడం వల్ల స్లీప్ హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది, ఇది రాత్రిపూట మంచి నిద్రను పొందడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, ఉదయపు సూర్యరశ్మి కూడా హ్యాపీ హార్మోన్ డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది మనకు ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాదు ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఆహారంపై శ్రద్ధ.. 

చలి సమయంలో ఆకలితోపాటు, ఆహారపు అలవాట్లు కూడా మారుతాయి. ప్రజలు అధిక చక్కెర , ఫాస్ట్ ఫుడ్ తినడం వైపు మొగ్గు చూపుతారు. ఫాస్ట్ ఫుడ్ , అధిక చక్కెర శరీరానికి హానికరమే కాదు, అవి మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి.

పండ్లు ,కూరగాయలు ,ఆరోగ్యకరమైన ఆహారం తినే వారి కంటే ఫాస్ట్ ఫుడ్ తినే వ్యక్తులు డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక పరిశోధనలో తేలింది.

ఆహార పదార్థాలు.. 

మన మూడ్‌ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, అందుకే చలికాలంలో జంక్ ఫుడ్ కాకుండా ఆరోగ్యకరమైన పదార్థాలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు.

 ప్రధాన కారణాలు..?

శీతాకాలంలో డిప్రెషన్ కి ప్రధాన కారణం సూర్యరశ్మి లేకపోవడం. సహజంగా చలికాలంలో ప్రజలు కిటికీలకు కర్టెన్లు వేస్తారు. తద్వారా ఉదయం సూర్యకాంతి వారి నిద్రకు భంగం కలిగించదు, కానీ ఈ సూర్యరశ్మి చాలా ముఖ్యమైనది. ఇది మన మానసిక స్థితిని చక్కగా ఉంచుతుంది. నిద్రను మెరుగుపరుస్తుంది. ఔషధాల ద్వారా చేసే పని, సూర్యరశ్మి సహజంగా చేస్తుంది.  

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.