కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి..?
సాక్షి లైఫ్: కోపం అనేది ఈ రోజుల్లో చిన్నా,పెద్ద అనే తేడాల్లేకుండా అందరిలోనూ సర్వసాధారణంగా మారింది. అది ఇంట్లో లేదా బయట ఎక్కడైనా ఎవరిలోనైనా కనిపిస్తుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత ఉంది. కోపం అనేది తనకు మాత్రమే కాకుండా ఎదుటి వ్యక్తికి కూడా హాని చేస్తుంది. చాలా మంది యోగులు, ఋషులు, నిష్ణాతులైన పండితులు కోపం వల్ల అనేక నష్టాలున్నాయని చెప్పేవాళ్ళు. అంతేకాదు కోపం వల్ల ఏమీ సాధించలేమని కూడా వారు వెల్లడించారు.
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
కోపం రెండు రకాలు.. మొదటి దాని విషయంలో కోపం వచ్చినా ఆ వ్యక్తికి తెలియదు. రెండవది కోపంవస్తే ఆ సమయంలో ఏదైనా చేసిన తర్వాత ఎదుట వ్యక్తితోపాటు కోపం వల్ల తలెత్తిన పరిస్థితులవల్ల విచారించాల్సి వస్తుంది. కాబట్టి మనం కోపాన్ని వదిలించుకోవడం చాలా ముఖ్యం. కోపం మానసికంగా, శారీరకంగా కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కనుక కోపాన్ని నియంత్రించు కోవడం కోసం ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలంటే..?
ఈ మధ్య కాలంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలవల్ల ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. కోపాన్ని తగ్గించాలంటే మౌనమే మొదటి మార్గం. ప్రతి వ్యక్తి ప్రతి రోజూ క్రమం తప్పకుండా మౌనం పాటించాలి. ప్రతిరోజూ 10 నిమిషాలతో ప్రారంభించండి, ఆపై అరగంట పాటు మౌనం పాటించడం నేర్చుకోండి. అలా నెమ్మదిగా ఒక గంట పాటు చేయవచ్చు.
ఇలా చేసిన సమయంలో మీరు ఏమీ మాట్లాడకూడదు, ఎలాంటి ఆలోచనలూ చేయకూడదు. ఏమీ ఆలోచించ కుండా ఉండడం అంటే, ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉన్నారని అర్థం. ఇలా చేయడంవల్ల సహనం పెంచుకోవచ్చు. ఈ నిశ్శబ్దం వ్యక్తిలో విపరీతమైన శక్తిని సృష్టిస్తుంది. శాంతి, సహనం వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని అందిస్తాయి.
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కు ప్రధాన కారణాలు..?
మరో పరిష్కారం హాస్యం అంటే నవ్వు. రోజుకు ఐదు సార్లు, కొన్ని నిమిషాల పాటు మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ప్రత్యక్షంగా కలిసి గానీ, ఫోన్ చేసి గానీ అందరూ నవ్వుకోండి. అలా చేయడం ద్వారా మనస్సు కొంతమేర శాంతపడుతుంది.
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
