WHO : మొండి వ్యాధులతో మానసిక కుంగుబాటు..‘డబ్ల్యూహెచ్‌ఓ’ ‘ఎసెన్షియల్ కేర్ ప్యాకేజీ’ 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మందికి పైగా పీడిస్తున్న ఉపేక్షిత ఉష్ణమండల వ్యాధులు (Neglected Tropical Diseases - NTDs) కేవలం శారీరక రుగ్మతలే కాదని, అవి తీవ్రమైన మానసిక వేదనకు దారితీస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఏనుగు కాళ్లు, కుష్టు, కాలే అజార్ వంటి వ్యాధులతో బాధపడేవారిలో కుంగుబాటు (Depression), ఆందోళన (Anxiety) ,ఆత్మహత్య ధోరణులు ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో, అటు శారీరక చికిత్సతో పాటు ఇటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చేలా ‘ఎసెన్షియల్ కేర్ ప్యాకేజీ’ (ECP)ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించింది.

సామాజిక వెలివేతతోనే ముప్పు.. 

వ్యాధి కన్నా సమాజంలో ఎదురయ్యే వివక్షే రోగులను కుంగదీస్తోందని పరిశోధకులు వెల్లడించారు. బాధితులను చూసి భయపడటం లేదా అసహ్యించుకోవడం వల్ల వారు సమాజంలో కలవలేక ఒంటరితనానికి గురవుతున్నారు. జబ్బు వల్ల ఉపాధి కోల్పోవడం, వైద్య ఖర్చులు పెరగడం వంటివి మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. వివక్షకు భయపడి రోగులు బయటపడకపోవడంతో వ్యాధి ముదిరిపోతోంది.

సమగ్ర చికిత్స అవసరం..

కేవలం మందులు ఇస్తే సరిపోదని, వైద్య విధానంలో మార్పులు రావాలని 'డబ్ల్యూహెచ్‌ఓ' సూచించింది. ప్రతి ఉపేక్షిత ఉష్ణమండల వ్యాధులు కలిగిన రోగి మానసిక ఆరోగ్యం కూడా పరీక్షించాలి. బాధితుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు మనస్తత్వ నిపుణులను ద్వారా కౌన్సెలింగ్ అందించాలి.

ఇవి అంటువ్యాధులు కావని, చికిత్సతో నయమవుతాయని సమాజంలో అవగాహన కల్పించాలి. విద్య, ఉపాధి రంగాల్లో బాధితులకు సమాన హక్కులు కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఈ మొండి వ్యాధులను పూర్తిగా నిర్మూలించడం అసాధ్యం. బాధితులను సామాజిక వెలివేత నుంచి రక్షించినప్పుడే వారు ఆరోగ్యవంతులుగా మారతారు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.