Mental Health : మన చేతుల్లోనే..! మానసిక ఆరోగ్యం.. ఒత్తిడిని జయించే సరైన చిట్కాలు..
సాక్షి లైఫ్ : ప్రజెంట్ జనరేషన్ యాంత్రిక జీవనంలో మగ్గిపోతోంది. ఆరోగ్యంగా ఉండాలంటే.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం (Mental Health) అత్యంత కీలకం. ఐతే పెరుగుతున్న పోటీ, సామాజిక కారణాల వల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థాయిలో ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్య నిపుణులు ప్రజల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు. మానసిక ప్రశాంతతకు కేవలం మందులు మాత్రమే కాదు, జీవనశైలిలో మార్పులు కూడా అవసరమని వారు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధం..
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి 'ఉన్నత ఆత్మగౌరవం' (High Self-esteem) ఒక గొప్ప ఆయుధమని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. తమపై తమకు నమ్మకం ఉన్నవారు క్లిష్ట పరిస్థితుల్లోనూ కుంగిపోకుండా స్థిరంగా ఉండగలుగుతారు.
ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి..
నిద్రలేమి కేవలం అలసటనే కాదు, తీవ్రమైన మానసిక ఆందోళనలను కలిగిస్తుంది. రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర వల్ల మెదడు తిరిగి ఉత్తేజితం అవుతుంది. సరైన నిద్ర ఉన్నప్పుడే మరుసటి రోజు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది.
వ్యాయామం.. ఆహారం.. సంతోషం..
ఇంట్లో వండుకున్న స్వచ్ఛమైన, పోషకాహారం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అవసరమైతే ఆహార నిపుణుల (Dietician) సలహాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో విడుదలయ్యే రసాయనాలు ఒత్తిడిని తగ్గించి, మూడ్‌ను ఉల్లాసంగా ఉంచుతాయి. స్నేహితులతో సరదాగా గడపడం, నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నవ్వు ఒక సహజమైన 'స్ట్రెస్ బస్టర్'లా పనిచేస్తుంది.
వర్తమానంలో జీవించండి..
గతం గురించి ఆలోచిస్తూ బాధపడటం లేదా భవిష్యత్తు గురించి అతిగా ఆందోళన చెందడం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుత క్షణం (Present moment) మీద దృష్టి సారించడం వల్ల జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించవచ్చు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
సహాయం కోరడానికి వెనుకాడవద్దు..
జీవితంలో ఎప్పుడైనా ఒత్తిడి భరించలేనంతగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మనసు విప్పి మాట్లాడాలి. అవసర మైతే మానసిక వైద్యనిపుణుల సహాయం తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!
ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
