Postpartum Stress Affects Fathers Too : తండ్రులకూ తప్పని 'ప్రసవాంతర' ఒత్తిడి..! ఏడాది దాటాక సమస్య.. వెల్లడించిన తాజా పరిశోధన

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాధారణంగా ఇంట్లోకి కొత్త అతిథి రాక అంటే ఆ కుటుంబంలో పండగే. పసిబిడ్డ సంరక్షణ, తల్లి ఆరోగ్యం విషయంలో అందరూ ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా ప్రసవం తర్వాత తల్లులు ఎదుర్కొనే 'పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్' ('postpartum depression) గురించి ఈ మధ్య అవగాహన పెరుగుతోంది. అయితే, బిడ్డ పుట్టిన ఆనందంలో తండ్రులు కూడా మానసిక ఒత్తిడికి లోనవుతారని, అది వెంటనే కాకుండా ఏడాది తర్వాత బయటపడుతుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

ఏమిటీ అధ్యయనం..?

స్వీడన్‌కు చెందిన కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సుమారు 10 లక్షల మంది తండ్రులపై సుదీర్ఘ కాలం పాటు పరిశోధనలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ప్రఖ్యాత 'జామా (JAMA) నెట్‌వర్క్ ఓపెన్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో తేలిన ముఖ్యాంశం ఏమిటంటే.. బిడ్డ పుట్టిన మొదటి కొన్ని నెలలు తండ్రులు ఎంతో ఉత్సాహంగా, బాధ్యతగా కనిపిస్తారు. కానీ, ఏడాది గడిచేసరికి వారిలో కుంగుబాటు లక్షణాలు 30 శాతం మేర పెరుగుతున్నట్లు గుర్తించారు.

ఒత్తిడికి ప్రధాన కారణాలు..

బిడ్డ పుట్టిన వెంటనే కాకుండా, ఏడాది తర్వాత తండ్రులలో మానసిక అలజడి పెరగడానికి పరిశోధకులు కొన్ని కారణాలను విశ్లేషించారు. నెలల తరబడి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మెదడుపై ప్రభావం పడి, చిరాకు, అలసట పెరుగుతాయి. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ పెరిగే ఖర్చులు, భవిష్యత్తు ప్రణాళికలు పురుషుల్లో ఆందోళనను కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య ఉండే ఏకాంతం, అనురాగం కాస్తా.. పూర్తిగా బిడ్డ చుట్టూ తిరిగే బాధ్యతగా మారిపోవడం వల్ల కొంతమంది పురుషులు మానసికంగా ఒంటరితనానికి గురవుతున్నారు. బిడ్డ రాకతో మొదట్లో ఉండే కొత్తదనం, ఉత్సాహం క్రమంగా తగ్గి.. రోజువారీ యాంత్రిక జీవనం ఒత్తిడిని పెంచుతోంది.

అవగాహన అవసరం..

ఈ పరిశోధనలో పాల్గొన్న ముఖ్య శాస్త్రవేత్త జింగ్ జౌ అభిప్రాయం ప్రకారం.. తండ్రులు తమ అలసటను పైకి కనిపించకుండా దాచుకుంటారు. "పురుషులు తమ బాధ్యతలను నెరవేర్చే క్రమంలో మానసిక ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ప్రసవాంతర కాలంలో తల్లుల ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యతను, తండ్రుల మానసిక స్థితికి కూడా ఇవ్వాలి" అని ఆమె పేర్కొన్నారు. తండ్రులు నిరంతర అలసట, నిరాశకు గురవుతుంటే దానిని సాధారణ విషయంగా వదిలేయకుండా, కుటుంబ సభ్యులతో పంచుకోవడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.