మెదడును బలహీన పరిచే ఈ 5 పానీయాలతో సమ్మర్ లో జాగ్రత్త..!
సాక్షి లైఫ్ : మన రోజువారీ జీవనశైలిలో కొన్ని పానీయాలు మనకు అలవాటుగా మారతాయి. అయితే, ఈ పానీయాలు మన మెదడు ఆరోగ్యాన్ని నీరసం చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐదు రకాల పానీయాలు మెదడు పనితీరును దెబ్బతీస్తాయి. ఈ పానీయాలు జ్ఞాపకశక్తిని బలహీనపరచడంతో పాటు నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..న్యూట్రిషనిస్ట్ - డైటీషియన్ మధ్య తేడా ఏమిటో తెలుసా..?
ఇది కూడా చదవండి..వేసవికాలంలో నీరసంగా లేకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం అవసరం..?
ఇది కూడా చదవండి..మలేరియా రహిత దేశంగా ప్రత్యేక చర్యలు..
చక్కెర పానీయాలు : కోలా, ఫ్రూట్ జ్యూస్‌లు వంటి అధిక చక్కెర కలిగిన పానీయాలు మెదడులో రక్త ప్రసరణను తగ్గిస్తాయి. ఇవి డిమెన్షియా వంటి సమస్యలకు దారితీస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఆల్కహాల్ : అతిగా మద్యం సేవించడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. దీర్ఘకాలంలో ఇది జ్ఞాపకశక్తి కోల్పోవడానికి, మానసిక ఒత్తిడికి కారణమవుతుంది.
ఎనర్జీ డ్రింక్స్: కెఫీన్, టౌరిన్ వంటి రసాయనాలతో కూడిన ఎనర్జీ డ్రింక్స్ మెదడును బలహీన పరుస్తాయి. ఇవి నిద్రలేమి, ఆందోళన వంటి మానసిక సమస్యలకు కారణమవుతాయి.
డైట్ సోడాలు: కృత్రిమ స్వీటెనర్లతో తయారైన డైట్ సోడాలు మెదడు కణాలను దెబ్బతీస్తాయి. ఇవి దీర్ఘకాలంలో న్యూరోలాజికల్ రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతాయి.
అధిక కెఫీన్ కలిగిన కాఫీ: రోజూ అతిగా కాఫీ తాగడం వల్ల మెదడు అలసిపోతుంది. ఇది ఒత్తిడి హార్మోన్లను పెంచి, ఆందోళన స్థాయిలను రెట్టింపు చేస్తుంది.
మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గ్రీన్ టీ, పండ్ల రసాలు, నీటిని ఎక్కువగా తాగాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అలాగే, సమతుల ఆహారం, వ్యాయామం, తగినంత నిద్ర కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి పానీయాలను తగ్గించి, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది కూడా చదవండి..మీకు అధిక కొలెస్ట్రాల్ ఉందా..? ఈ 5 కూరగాయలు తినండి..
ఇది కూడా చదవండి..ఫుడ్ అనేది పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?
ఇది కూడా చదవండి..విటమిన్ "సి" లోపం చర్మ ఆరోగ్యంపై, ముఖ్యంగా పాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..పాదాల పగుళ్లకు ప్రధాన కారణాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
