Counselors : కౌన్సిలర్ వృత్తిపరమైన హద్దులు దాటితే శిక్ష తప్పదు.. కొత్త చట్టం..
సాక్షి లైఫ్ : మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి దారి చూపాల్సిన కౌన్సిలర్, తన వృత్తిపరమైన హద్దులను (Professional Boundaries) మీరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. క్లయింట్‌తో అతి చనువుగా ప్రవర్తించడం, వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వంటి అంశాలపై బాధితులు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధి కారులు విచారణ చేపట్టారు. అసలు ఏం జరిగింది? అంటే..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
అనుచితంగా ప్రవర్తించినట్లు..
అమెరికాలోని అయోవా (Iowa) రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసిన ఒక కేసు ప్రకారం, ఒక మానసిక ఆరోగ్య కౌన్సిలర్ తన క్లయింట్‌తో అనుచితంగా ప్రవర్తించినట్లు బోర్డు నిర్ధారించింది. కౌన్సిలింగ్ సెషన్‌లో రోగి సమస్యలను వినాల్సింది పోయి, కౌన్సిలర్ తన సొంత వ్యక్తిగత విషయాలను క్లయింట్‌తో పంచుకుని వారిని ఇబ్బంది పెట్టారు. క్లయింట్‌ను కౌగిలించుకోవడమే కాకుండా, అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారం, ఒక కౌన్సిలర్ తన క్లయింట్‌తో కేవలం చికిత్సకు సంబంధించిన సంబంధాన్ని మాత్రమే కలిగి ఉండాలి. కానీ ఇక్కడ 'లైన్ క్రాస్' చేసినట్లు తేలింది.
కౌన్సిలింగ్ రంగంలో హద్దులు..
ప్రతి కౌన్సిలర్ పాటించాల్సిన కొన్ని కఠిన నిబంధనలను ఆరోగ్య సంస్థలు గుర్తు చేస్తున్నాయి. క్లయింట్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ శారీరక చనువుగా అంటే కౌగిలింతలు, తాకడం చేయకూడదు. క్లయింట్‌తో స్నేహం చేయడం, వారితో కలిసి డిన్నర్‌లకు వెళ్లడం లేదా ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం నేరం.
గోప్యత (Confidentiality).. క్లయింట్ చెప్పిన విషయాలను మూడో వ్యక్తికి లేదా సోషల్ మీడియాలో పంచు కోకూడదు. క్లయింట్స్ నుంచి ఖరీదైన బహుమతులు స్వీకరించడం వృత్తిపరమైన ఉల్లంఘన కిందికే వస్తుంది.
సదరు కౌన్సిలర్‌పై విచారణ జరిపిన బోర్డు, అతని లైసెన్స్‌పై ఆంక్షలు విధించింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే శాశ్వతంగా వృత్తి నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. అలాగే, సదరు కౌన్సిలర్ అదనంగా 'ప్రొఫెషనల్ బౌండరీస్' అండ్ 'ఎథిక్స్' పై ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని ఆదేశించింది. కౌన్సిలింగ్ అనేది కేవలం సంభాషణ కాదు, అది ఒక పవిత్రమైన బాధ్యత. క్లయింట్ నమ్మకాన్ని కాపాడటం కౌన్సిలర్ ప్రాథమిక కర్తవ్యం. ఒకవేళ ఎవరైనా కౌన్సిలర్ మీతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అనిపిస్తే వెంటనే సంబంధిత బోర్డులకు ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Vitamin D Superfoods : విటమిన్ డి సూపర్ ఫుడ్స్: ఈ నాలుగు ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
