Feel-Good Chemicals : ఫీల్ గుడ్ రసాయనాలు అంటే ఏమిటి..? మనకు ఎలా ఉపయోగపడతాయి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శారీరక శ్రమ చేసినప్పుడు మన శరీరంలో జరిగే రసాయనిక చర్యలు మనల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి..? ఎలాంటి రసాయనాలు హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి..? వ్యాయామానికి, మనసుకి ఏంటి లింక్..? అనే అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? 

హ్యాపీ హార్మోన్ల విడుదల.. 

మనం చెమట చిందించేలా వ్యాయామం చేసినప్పుడు, మెదడు 'ఎండార్ఫిన్లు' (Endorphins) అనే రసాయనాలను విడుదల చేస్తుంది. వీటినే 'ఫీల్ గుడ్' రసాయనాలు అంటారు. ఇవి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, మనసులో ఒక రకమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి.

ఒత్తిడికి చెక్..

వ్యాయామం వల్ల శరీరంలో సెరోటోనిన్, డోపమైన్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి నిద్రలేమిని దూరం చేసి, మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. క్రమం తప్పకుండా వాకింగ్, యోగా లేదా జిమ్ చేసేవారిలో కుంగుబాటు (Depression), ఆందోళన వంటి సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శారీరకంగా దృఢంగా మారుతున్నామనే భావన మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వదు.

ఏమేం చేయాలి..?

రోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, సైక్లింగ్, ఈత లేదా నృత్యం వంటివి చేయడం వల్ల ఈ రసాయనాలు విడుదలై రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి. డల్‌గా ఉన్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక 15 నిమిషాల పాటు అలా బయటనడవడం ద్వారా.. మెదడులో విడుదలయ్యే సహజ రసాయనాలు మూడ్‌ని మారుస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. 

 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.