Text Neck and Pinky Finger : టెక్స్ట్ నెక్, పింకీ ఫింగర్ అంటే..?

షేర్ చేయండి:
Text Neck and Pinky Finger : టెక్స్ట్ నెక్, పింకీ ఫింగర్ అంటే..?

సాక్షి లైఫ్ : స్మార్ట్‌ఫోన్ అతిగా వాడుతున్నారా.. అయితే మీ మెడ, వేళ్లు ప్రమాదంలో పడ్డట్లే! విరామం లేని డిజిటల్ వినియోగం తెచ్చిపెడు తున్న కొత్త రోగాలివే..నేటి యాంత్రిక జీవనంలో స్మార్ట్‌ఫోన్ శరీరంలో ఒక భాగమైపోయింది. ఉదయం కళ్లు తెరిచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు అరచేతిలో ఫోన్ లేనిదే కాలం గడవదు. అయితే, ఈ 'స్మార్ట్' అలవాటు మనల్ని శారీరక వైకల్యాల దిశగా నెడుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువతలో 'టెక్స్ట్ నెక్', 'పింకీ ఫింగర్' వంటి కొత్త రకపు సిండ్రోమ్‌లు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

ఏమిటీ 'టెక్స్ట్ నెక్' సిండ్రోమ్..?

సాధారణంగా మన తల బరువు సుమారు 4 నుంచి 5 కిలోలు ఉంటుంది. కానీ, ఫోన్ చూస్తున్నప్పుడు మనం తలను వంచే కోణాన్ని బట్టి మెడపై పడే ఒత్తిడి 20 నుంచి 25 కిలోల వరకు పెరుగుతుంది. మెడ బిగుసుకుపోవడం, భుజాల నొప్పి, తరచుగా వచ్చే తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. దీర్ఘకాలం ఇలాగే కొనసాగితే వెన్నుపాము దెబ్బతినే అవకాశం ఉంది.

 పింకీ ఫింగర్ సిండ్రోమ్..!

మనం ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నప్పుడు, ఫోన్ కింద భాగంలో చిటికెన వేలును (Pinky Finger) ఆసరాగా ఉంచుతాము. గంటల తరబడి ఫోన్ బరువు మొత్తం ఆ చిన్న వేలుపైనే పడటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.  చిటికెన వేలు మొద్దుబారడం, నొప్పి రావడం లేదా క్రమంగా వంకరపోవడం వంటి మార్పులు సంభవిస్తాయి. ఇది చేతిలోని నరాలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది.
 
నివారణ మార్గాలు ఏంటంటే..? 

డిజిటల్ యుగంలో ఫోన్ వాడకాన్ని పూర్తిగా మానేయలేం, కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఫిజియోథెరపీ నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ వాడుతున్నప్పుడు మెడను వంచకుండా, ఫోన్‌ను మీ కళ్ల స్థాయికి (Eye Level) ఎత్తులో ఉంచుకోవాలి.

20-20 సూత్రం.. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఫోన్ పక్కన పెట్టి, మెడ మరియు భుజాలను సున్నితంగా సాగదీయాలి (Stretching).
ఫోన్ బరువు మొత్తం ఒకే వేలుపై పడకుండా రెండు చేతులతో పట్టుకోవడం లేదా ఫోన్ హోల్డర్లను వాడటం ఉత్తమం.

డిజిటల్ డిటాక్స్..రోజులో కనీసం రెండు గంటల పాటు ఫోన్‌కు దూరంగా ఉండేలా 'డిజిటల్ డిటాక్స్' అలవాటు చేసుకోవాలి.
మన శరీరం ఒక యంత్రం లాంటిది. దానికి తప్పుడు భంగిమలతో తుప్పు పట్టించకండి. స్మార్ట్‌ఫోన్‌ను స్మార్ట్‌గా వాడండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.