స్కిజోఫ్రేనియా ఉన్నవ్యక్తులలో కనిపించే ప్రధాన లక్షణాలు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : స్కిజోఫ్రెనియా అనేది ఒక తీవ్రమైన మానసిక రుగ్మత. ఇది ఒక వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. స్కిజోఫ్రెనియాతో బాధపడేవారు వాస్తవికతను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది వారి దైనందిన జీవితాన్ని, విద్యను, ఉద్యోగాన్ని, సామాజిక సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

ఇది కూడా చదవండి..బ్లడ్ హిమోగ్లోబిన్ స్థాయిలను సహజంగా పెంచే పండ్లు..

ఇది కూడా చదవండి..పిత్తాశయ రాళ్లకు ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..పురుషుల కంటే మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువ.. ఎందుకు కారణాలు ఏంటి..?

ప్రపంచంలో సుమారు ఒక మంది స్కిజోఫ్రేనియాతో బాధపడుతున్నారని అంచనా. ఈ మానసిక రుగ్మత వ్యక్తుల ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనలను ప్రభావితం చేస్తుంది. స్కిజోఫ్రేనియా రుగ్మతపై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

 
హాల్యూసినేషన్స్: వాస్తవానికి లేని వస్తువులు, శబ్దాలు లేదా వ్యక్తులను చూడడం లేదా వినడం.

డిల్యూషన్స్: లేని విషయాలను నిజంగా ఉన్నట్లు నమ్మడం.

అనియంత్రిత ఆలోచనలు, మాటలు: ఆలోచనలు గందరగోళంగా ఉండడం, అర్థం కాని విధంగా మాట్లాడడం.

సామాజిక దూరం: ఇతరులతో సంబంధాలు తగ్గించడం, భావోద్వేగాల లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ లక్షణాలు సాధారణంగా 16 నుంచి 30 సంవత్సరాల మధ్య వ్యక్తులలో మొదలవుతాయి. అయితే పురుషుల్లో ఈ లక్షణాలు త్వరగా కనిపిస్తాయి, మహిళల్లో అయితే కాస్త ఆలస్యంగా కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?

ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

 

గమనికఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.