New Trend: యూత్ న్యూ  ట్రెండ్ : 'యాంటీ వాలెంటైన్స్ డే' అంటే ఏమిటి..?   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా రెడ్ రోజెస్, క్యాండిల్ లైట్ డిన్నర్స్, లవ్గిఫ్ట్స్  సందడే కనిపిస్తుంది. అయితే, ఈ పాతబడ్డ పద్ధతులకు స్వస్తి చెబుతూ ఇప్పుడు యూత్ లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అదే.. 'యాంటీ వాలెంటైన్స్ డే'. ముఖ్యంగా మహిళల్లో ఈ ట్రెండ్ కు విశేష ఆదరణ లభిస్తుండటం విశేషం. కేవలం జంటల కోసమే కాకుండా, తనను తాను ప్రేమించుకునే (Self Love) ప్రతి ఒక్కరి కోసం ఈ సరికొత్త వేడుక వేదికవుతోంది.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

అసలు ఏంటిది..?  

'యాంటీ వాలెంటైన్స్ డే' అంటే ప్రేమకు వ్యతిరేకం కానే కాదు. ఇది స్వీయ గౌరవానికి, స్నేహానికి ప్రతీక. ముఖ్యంగా ఒంటరిగా ఉన్నవారు, బ్రేకప్ నుంచి కోలుకుంటున్న వారు, ప్రేమకు దూరంగా ఉండాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వేడుక. దీనిని మహిళలు తమ స్నేహితురాళ్లతో కలిసి 'గాలెంటైన్స్ డే' (Galentine's Day) గా కూడా జరుపుకుంటున్నారు.

 దీనికి ఎందుకు ఫిదా అవుతున్నారు అంటే..?

వాలెంటైన్స్ డే వస్తోందంటే చాలు.. భాగస్వామి లేని వారు ఏదో వెలితిగా భావించేలా సమాజం ఒక ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ యాంటీ వాలెంటైన్స్ పార్టీలు ఆ అపోహను తుడిచివేస్తున్నాయి. "నేను ఒంటరిగా ఉన్నా సంతోషంగానే ఉన్నాను" అని చాటి చెప్పే ధైర్యాన్ని మహిళలకు ఇస్తున్నాయి.

 ప్రేమలో పడి చాలామంది తమ ఆత్మీయ స్నేహితులను మర్చిపో తుంటారు. కానీ, కష్టాల్లో తోడుండేది స్నేహితులేనని భావించే మహిళలు, తమ చెలిమిని గౌరవించుకోవడానికి ఈ రోజును ఒక అవకాశంగా మలచుకుంటున్నారు.

తమను తాము ప్రేమించుకుంటూ.. వేరొకరు కానుకలు ఇస్తారని ఎదురుచూడకుండా.. తమకు ఇష్టమైన ఆహారాన్ని తినడం, స్పా చికిత్సలు తీసుకోవడం, నచ్చిన వస్తువులను కొనుక్కోవడం వంటి వాటి ద్వారా మహిళలు 'సెల్ఫ్ కేర్'కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

 ఒకప్పుడు అమ్మాయిలు అంటే ప్రపోజల్స్ కోసం ఎదురుచూసేవారు. కానీ నేడు ట్రెండ్ మారింది. తమ జీవితాన్ని, సంతోషాన్ని తామే శాసించగలమనే ఆత్మవిశ్వాసం ఈ వేడుకల ద్వారా వ్యక్తమవుతోంది.

 యాంటీ వాలెంటైన్స్ డే వేడుకల ప్రత్యేకతలేమిటి..?

వాలెంటైన్స్ డేకి పూర్తి భిన్నంగా ఈ వేడుకలను జరుపుకుంటారు..

ముఖ్యంగా ఎరుపు రంగుకు బదులుగా యాంటీ వాలెంటైన్స్ డే పార్టీల్లో నలుపు లేదా డార్క్ రంగుల దుస్తులు ధరిస్తారు.

సాంగ్స్,గేమ్స్..

విరహ గీతాలకు బదులుగా స్వేచ్ఛను చాటిచెప్పే పాటలకు స్టెప్పులేస్తారు. గతాన్ని మర్చిపోవడానికి, పాత జ్ఞాపకాలను వదిలించుకోవడానికి ఫన్నీ గేమ్స్ ఆడుతూ గడుపుతారు.
మొత్తం మీద, ప్రేమ అంటే కేవలం ఇద్దరి మధ్య ఉండేదే కాదు.. మనల్ని మనం ప్రేమించుకోవడం కూడా ప్రేమేనని "యాంటీ వాలెంటైన్స్ డే" ట్రెండ్ నిరూపిస్తోంది.

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.